Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి

Couple

Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. గత రాత్రి సాంబశివరావు, పావని ఒక రెస్టారెంటులో ఉండగా యువతి తండ్రి, తమ్ముడు ఈ జంటపై కర్రలతో దాడి చేశారు.

AP Govt: ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ చర్చలు

యువతి తమ్ముడు సాంబశివరావు చెవి కొరికివేశాడు. దీంతో గాయపడ్డ జంట అక్కడ్నుంచి తప్పించుకుని, ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే తమను చంపుతామని బెదిరిస్తుంటే, ఏసీపీని కలిస్తే కౌన్సెలింగ్ ఇచ్చారని ఆ జంట తెలిపింది.