Mumbai : 10వ తరగతిలో అన్ని సబ్జెక్టులు 35 మార్కులతో పాసైన కొడుకు.. సెలబ్రేట్ చేసుకున్న కుటుంబం

పరీక్షల్లో మంచి మార్కులతో పాసైతే విద్యార్ధుల పేరెంట్స్ సంబరాలు జరుపుకోవడం చూసాం. కానీ ముంబయిలో ఓ విద్యార్ధి 10వ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు తెచ్చుకుని పాసవ్వడంతో అతని కుటుంబం సంబరాలు చేసుకుంది. పిల్లలు మంచి మార్కులతో పాసవ్వడం అనే కాదు.. పిల్లలు పాసవ్వడం కూడా సంతోషించే విషయం అని అతని తల్లిదండ్రులు చెప్పడం విశేషం.

Mumbai : 10వ తరగతిలో అన్ని సబ్జెక్టులు 35 మార్కులతో పాసైన కొడుకు.. సెలబ్రేట్ చేసుకున్న కుటుంబం

Mumbai

Mumbai Viral News : మార్కులు తక్కువ వస్తాయేమో అని భయపడి ముందుగానే బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్ధుల గురించి విన్నాం. తీరా రిజల్ట్ వచ్చాక వారు మంచి మార్కులతో పాసై తల్లిదండ్రులకు శోకం మిగిల్చారని తెలిసి బాధపడ్డాం. పిల్లలకి మార్కులు తక్కువ వస్తే అవమానంగా భావించిన తల్లిదండ్రుల్ని కూడా చూసాం. కానీ తమ బిడ్డ 10వ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు తెచ్చుకుని పాసయ్యాడని ఓ కుటుంబం సంబరాలు జరుపుకుంది. వీరి సంబరాల గురించి ఐఏఎస్ అధికారి అవనీష్ శ్రవణ్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Mother-Son emotional video viral : కంట తడి పెట్టిస్తున్న తల్లీ-కొడుకుల ఎమోషనల్ వీడియో

పిల్లలు బాగా చదువుకోవాలని వారికి మంచి మార్కులు రావాలని పేరెంట్స్ ఆశించడంలో తప్పులేదు. అందులో భాగంగా వారిపై ఒత్తిడి తెస్తారు. వాళ్లు అనుకున్నట్లు జరగకపోతే కొంచెం అవమానంగా ఫీలయ్యే పేరెంట్స్ ఉంటారు. అయితే తమ బిడ్డ ఫస్ట్ మార్కులు సంపాదించకపోయినా పాసయ్యాడు చాలన్నట్లు ఓ కుటుంబం సంబరాలు జరుపుకోవడం కొంచెం డిఫరెంట్‌గా ఉంది.

 

ముంబయికి చెందిన విశాల్ కరాద్ అనే స్టూడెంట్ 10వ తరగతి పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్ లో 35 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా వారి కుటుంబం సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారి అవనీష్ శ్రవణ్ Awanish Sharan తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘ముంబైకి చెందిన 10వ తరగతి విద్యార్థి పదవ తరగతి పరీక్షల్లో 35% మార్కులు సాధించాడు..కానీ అతని తల్లిదండ్రులు కోపగించుకోలేదు.. విచారించలేదు.. చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు’ అనే శీర్షికతో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Story of mother and son : తల్లి ఇష్టాన్ని నెరవేర్చిన కొడుకు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఆయుష్ గోయల్ కథ..

 

విశాల్ 10వ తరగతిని మరాఠీ మీడియంలో చదువుకున్నాడు. అతని తండ్రి ఆటో నడుపుతాడు..తల్లి ఇళ్లలో పనులు చేస్తూ ఉంటుంది. అతనికి చదువు చెప్పించాలని తల్లిదండ్రులు పడ్డ తాపత్రయం అతను టెన్త్ పాసవ్వడంతో సంతోషాన్ని పంచింది. ‘పిల్లలు మంచి మార్కులతో పాసైతే తల్లిదండ్రులు సంబరాలు చేసుకుంటారు.. కానీ మాకు విశాల్ అన్ని సబ్జెక్టులు పాసవ్వడం సంతోషాన్నిచ్చింది’ అని అతని తండ్రి చెప్పడం విశేషం.