Puri Jagannadh : ప్రముఖ పుణ్యక్షేత్రం…పూరీ జగన్నాధుని ఆలయం

ఆలయ నిర్మాణ మంతా ప్రత్యేకతో కూడుకున్నది. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం విశేష ఆకర్షణగా నిలుస్తుంది.

Puri Jagannadh : ప్రముఖ పుణ్యక్షేత్రం…పూరీ జగన్నాధుని ఆలయం

Puri (3)

Puri Jagannadh : భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏడు హిందూ దేవాలయాల్లో ఒరిస్సాలోని పూరిజగన్నాధ స్వామి ఆలయం కూడా ఒకటి. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న పూరీలో జగన్నాధ స్వామి ఆలయం కొలువై ఉంది. ప్రతి ఏటా ఆషాడ శుక్ల విదియ రోజు ఇక్కడ నిర్వహించే రధయాత్ర కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ మహి విష్ణువు కలలో కనిపించి చెప్పిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురణగాధలు చెబుతున్నాయి.

పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , నీలాద్రి, శంఖక్షేత్రగా పిలిచేవారు. ప్రధాన ఆలయంలో జగన్నాధ్, బలభద్ర, సుభలద్రల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ రాధా,దుర్గ, లక్ష్మీ, పార్వతి, సతి, కృష్ణతో కూడిన శక్తి నిలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ మంతా ప్రత్యేకతో కూడుకున్నది. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం విశేష ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీకృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ఆలయ గోడలు, స్ధంబాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. జగన్నాధ ఆలయం గోపురం పై ఉండే జండాకు ఓ ప్రత్యేక ఉంది. గాలి వస్తున్న దిశకు కాకుండా వ్యతిరేక దిశలో ఈ జండా ఊగుతూ ఉంటుంది.

ఆలయంలో ఎత్తైన గోపురం పై ఉండే సుదర్శనచక్రం పూరీలో ఎక్కడ నుండైనా దానిని తిలకించవచ్చు. ఎటువైపు నుండి చూసినా ఆచక్రం మీవైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయంపై నుండి పక్షులు ఎగురుతూ వెళ్ళవని అక్కడి పండితులు చెబుతున్నారు. ఉదయం నుండి రాత్రి చికటీ పడేంతవరకు సూర్యుడు ఉన్న సమయంలో ఆలయం గోపురం నీడ కనిపించదు. పూరి జగన్నాధ్ ఆలయం భారతీయ సంస్కృతులకు అద్దంపడుతుంది. జగన్నాధునితోపాటు, బలభద్ర, సుభలద్రల విగ్రహాలు చెక్క విగ్రహాలు. దారు బ్రహ్మగా పిలిచే వేపకాండం నుండి వీటిని తయారు చేశారు.

ఆదివాసీ వంశస్ధులు ఇప్పటికీ అక్కడ దైతపతులుగా ఆలయంలో పూజాకార్యకలాపాలలో ప్రధానపాత్ర పోషిస్తారు. రధయాత్ర సమయంలో ఆలయంలోని జగనన్నాధ, బలభద్ర, సుభలద్రల విగ్రహాలను బయటకు తీసుకువచ్చి రధంపై కొలువుదీర్చి యాత్ర నిర్వహిస్తారు. ఆలయంలోపల మహలక్ష్మీ ఆలయంలో నిత్యం పూజాకార్యక్రమాలు జరుగుతుంటాయి. జగన్నాధునికి పెట్టే నైవేధ్యాన్ని మహలక్ష్మీ అమ్మవారు పర్యవేక్షిస్తుంటారని నమ్మకం.

స్వామి వారికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. స్వామికి సమర్పించే ప్రసాదం సైతం చాలా విశిష్టమైనది. స్వామి వారికి ప్రసాదం సమర్పించిన తరువాత ఆ ప్రసాదం పరిమళ భరితంగా మారి అందులో నుండి సువాసనలు వెదజల్లు తాయట. పర్యాటకులకు వార్షిక బీచ్ ఫెస్టివల్ ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. పూరీలో హస్తకళలు, కుటీర పరిశ్రమలలో తయారైన వస్తువులు ఎక్కువగా లభిస్తాయి. సముద్రపు గవ్వలతో తయారైన వస్తువులతోపాటు, బెల్ మెటల్, టెర్రకోట, ప్యాచ్ వర్క్ డిజైన్లు ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటాయి.