Bigg Boss Divi : పాపా.. ఇది కాస్త ఓవర్‌గా లేదూ.. బిగ్‌బాస్‌ బ్యూటీపై నెటిజన్స్ ట్రోల్స్

దివి.. సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ప్రేక్షకదారణ పొందింది.

Bigg Boss Divi : పాపా.. ఇది కాస్త ఓవర్‌గా లేదూ.. బిగ్‌బాస్‌ బ్యూటీపై నెటిజన్స్ ట్రోల్స్

Bigg Boss Divi

Bigg Boss Divi : దివి.. సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ప్రేక్షకదారణ పొందింది.



బిగ్‌బాస్‌ తర్వాత ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. తన సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటుంది. అంతేకాదు ఫోటో షూట్‌లు చేస్తూ, పలు ప్రకటనల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దివి.. బంజారాహిల్స్‌లోని.. ప్రోటీన్స్… హైజిన్ నాన్ వెజ్ మార్ట్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఈ బ్రాండ్‌ ప్రకటనలో నటించింది. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను దివి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ‘దివి పాపా.. కాస్త ఓవర్‌ చేస్తోంది’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.



Divi




ఈ యాడ్‌లో దివి తన వంట మనిషితో మాట్లాడే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. పాపా.. బాగా తుడిచావా, బాగా కడిగావా అంటూ వయ్యారాలు పోతుంది. ముందుగా.. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన దివి.. అక్కడున్న వంటమనిషిని.. పాపా తుడిచావా అని దివి అడిగితే.. క్లీన్ గా పాపగారు..అని పని మనిషి రిప్లయ్ ఇస్తుంది. ఆ తర్వాత పాపా కడిగావా అని అడుగుతుంది. అందుకు ఆమె క్లీన్ గా పాపగారు అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత చేప కూర వండావా.. నాకు నీ మీద నమ్మకం లేదు.. ఎక్కడి నుంచి తెచ్చావో ఏమో అని పనిమనిషిపై సందేహం వ్యక్తం చేస్తుంది. దీనికి పనిషి మనిషి కాస్త సీరియస్ గా ముఖం పెట్టి.. పాపగారు… దీన్ని ప్రోటీన్స్ నుంచి తెచ్చాను అని చెబుతుంది. అంతే.. దివి ముఖంలో నవ్వులు విరబూస్తాయి. ఫుల్ హ్యాపీ అవుతుంది.. నాకు ప్రొటీన్స్ మీద ఫుల్లు నమ్మకం ఉంది.. అంటూ ప్రోటీన్స్… హైజీన్ నాన్ వెజ్ మార్ట్ గురించి అడ్వర్ టైజ్ ఇస్తుంది దివి.

Divi



ఈ యాడ్ చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. పాప కాస్త ఓవర్ చేసిందని ఒకరు, పాపా… బొక్కలా ఉంది నీ యాడ్ అని మరొకరు, ఇది ఓవర్ యాక్టింగ్ అని మరొకరు, ఓవర్ అయ్యింది పాపా అని ఇంకొకరు కామెంట్ చేశారు. నీ యాక్టింగ్ చూశాక నిన్ను అన్ ఫాలో అవుతున్నా మరో నెటిజన్ ఘాటుగా కామెంట్ పెట్టాడు.

Divi Vadthya

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)