ఫరాన్ అఖ్తర్ కుమ్మేశాడు..

వెర్సటైల్ యాక్టర్, రైటర్, సింగర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌గా మల్టీటాలెంటెతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు ఫర్హాన్ అక్తర్.. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, ఫర్హాన్ కాంబోలో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘తూఫాన్’..

ఫరాన్ అఖ్తర్ కుమ్మేశాడు..

Toofaan Teaser

TOOFAAN Teaser: వెర్సటైల్ యాక్టర్, రైటర్, సింగర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌గా మల్టీటాలెంట్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు ఫరాన్‌ అఖ్తర్‌.. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, ఫర్హాన్ కాంబోలో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘తూఫాన్’..

TOOFAAN

ఇప్పటివరకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తూఫాన్’ టీజర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఫరాన్ ఈ క్యారెక్టర్ కోసం తనను తాను ఎంతో బాగా ట్రాన్స్‌ఫర్మ్ చేసుకున్నారు. బాక్సింగ్ సీన్స్‌లో జీవించేశారు..

ఫరాన్ అఖ్తర్ కోచ్‌గా పరేష్ రావెల్, ప్రియురాలిగా మృణాల్ ఠాకుర్ కనిపించారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘తూఫాన్’ టీజర్ చూసి సినిమా చూడ్డానికి వెయిట్ చెయ్యలేకపోతున్నానని ట్వీట్ చేశారు. ROMP పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రితేష్ సిద్వానీ, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, ఫరాన్‌ అఖ్తర్‌ కలిసి నిర్మిస్తున్న ‘తూఫాన్’ మే 21 నుండి అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.