Faridabad Metro Station : మెట్రో స్టేషన్‌లో కలకలం.. యువతి ఆత్మహత్యాయత్నం.. పోలీసులపై ప్రశంసల వర్షం

ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. ఓ యువతి మెట్రో స్టేషన్‌ లో ఆత్మహత్యాయత్నం చేయబోయింది. మెట్రో స్టేషన్ పైనుంచి దూకేయ‌బోయింది. అయితే,

Faridabad Metro Station : మెట్రో స్టేషన్‌లో కలకలం.. యువతి ఆత్మహత్యాయత్నం.. పోలీసులపై ప్రశంసల వర్షం

Faridabad Metro Station

Faridabad Metro Station : ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. ఓ యువతి మెట్రో స్టేషన్‌ లో ఆత్మహత్యాయత్నం చేయబోయింది. మెట్రో స్టేషన్ పైనుంచి దూకేయ‌బోయింది. అయితే, ఫరీదాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి యువతిని కాపాడారు. కింద‌కు దింపారు. ఈ ఘ‌ట‌న‌తో మెట్రో స్టేష‌న్ కింద కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. జూలై 24న సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఫరీదాబాద్‌ సెక్టార్ -28 మెట్రో రైల్‌ స్టేషన్ పైకి ఎక్కిన ఢిల్లీకి చెందిన యువ‌తి ఆత్మహత్యాయ‌త్నం చేసింది. ఈ విష‌యంపై సమాచారం అందుకున్న ఎస్ఐ ధన్‌ ప్రకాశ్‌, కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్ అక్క‌డికి వెళ్లారు. మెట్రో సిబ్బందితో క‌లిసి ఆ యువ‌తికి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

స్టేషన్‌ కింద ఉన్న ఎస్ఐ ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చారు. ఇంతలో పైకి ఎక్కి ఆమె దగ్గరికి వెళ్లిన‌ కానిస్టేబుల్‌ సర్ఫ్‌రాజ్ ఆ అమ్మాయిని ఒక్క‌సారిగా ప‌ట్టుకున్నారు. అనంత‌రం ఆమెను కింద‌కు తీసుకొచ్చారు. ఢిల్లీకి చెందిన యువతి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధ‌ప‌డుతోంది. ఈ కార‌ణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. కాగా, ఎంతో తెలివిగా వ్యవహరించి ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులు నెటిజన్ల హృదయాలు గెలిచారు. పోలీసులు రావడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా, తెలివిగా వ్యవహరించకపోయినా ఊహించని ఘోరం జరిగిపోయేదని నెటిజన్లు అంటున్నారు.