Viral News: గోమాత మీద ప్రేమ.. ఆవుదూడకు ఘనంగా జన్మదిన వేడుకలు!

ఆవు అంటే గోమాతగా భావించే సమాజం మనది. అవును లక్ష్మీదేవిగా పూజించే భారతీయులు తన ఇంట గోమాత ఉంటే లక్ష్మీ దేవినే ఉన్నట్లుగా భావిస్తారు. గోమాతకి హిందూసాంప్రదాయంలో ఇచ్చే విలువ ఎంతో..

Viral News: గోమాత మీద ప్రేమ.. ఆవుదూడకు ఘనంగా జన్మదిన వేడుకలు!

Viral News

Viral News: ఆవు అంటే గోమాతగా భావించే సమాజం మనది. అవును లక్ష్మీదేవిగా పూజించే భారతీయులు తన ఇంట గోమాత ఉంటే లక్ష్మీ దేవినే ఉన్నట్లుగా భావిస్తారు. గోమాతకి హిందూసాంప్రదాయంలో ఇచ్చే విలువ ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందుకే ఇప్పటి వరకు మనం నెలలు నిండిన గోమాతకి శ్రీమంతం చేయడం వంటి ఘటనలు కూడా చూశాం. కాగా, ఆంధప్రదేశ్ కి చెందిన ఓ కుటుంబం మాత్రం మరో అడుగు ముందుకేసి గోమాత తొలి బిడ్డ ఆవుదూడకి కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

Rajoli Police: బూటు కాలితో తన్ని.. చావబాదిన ఎస్సై.. వీడియో వైరల్!

కడప జిల్లా సుండుపల్లె మండలం ఈడిగెపల్లెకు చెందిన రైతు శంకర్ గోమాతను భక్తి సొంత మనిషిలా చూసుకున్నాడు. ఈ గోవుకు యేడాది క్రితం ఓ ఆవుదూడ జన్మించగా.. తన ఇంట లక్ష్మీదేవికి మళ్ళీ లక్ష్మీదేవినే జన్మించిందంని సంబరపడిపోయి దూడను కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ లేగదూడకి యేడాది నిండడంతో రైతు శంకర్ ఆ ఆవుదూడకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించాడు. తమ ఇంటి నుండి మేళ తాళాలతో గ్రామంలోని కొత్త పురమ్మ ఆలయం వద్దకు గోమాతను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Gulab Effect: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ వాయిదా

కేవలం అమ్మవారి గుడిలో పూజలే కాదు గోవు ముందు రైతు శంకర్ ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి గోవుకు తినిపించారు. అనంతరం గ్రామస్తులందరికి కేక్ పంచి సంబరాలు జరుపుకున్నాడు. రైతు శంకర్ చేసిన పనికి గ్రామస్థులు అభినందనలు తెలపగా.. సహజంగా గోమాత అంటే పూజలు జరిపించడం ఒక్కటే కాదు.. గోమాతని తన ఇంట సభ్యురాలిగా చేసుకున్నప్పుడే ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుందని వేదపండితులు చెప్తున్నారు.