Farm Ponds : సేద్యపు కుంట… చేపల పంట

నీటి కుంటల ద్వారా నీటి ఎద్దడి తగ్గటంతోపాటు, భూగర్భజలాలు బాగా పెరిగాయి. నీటి కుంటల్లో చేపలను పెంచటం వల్ల వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేపల విసర్జించే వ్యర్ధాలతో కూ

Farm Ponds : సేద్యపు కుంట… చేపల పంట

Water Ponds

Form Ponds : వర్షపు నీటి బొట్టును వడిసి పట్టి సాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టిన సేద్యపు కుంటులు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయ అవసరాలకు ఈ కుంటలను వినియోగించుకుంటూనే వీటిలో చేపల పెంపకం ద్వారా అదనపు అదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. సాగు విధానంలో విన్నూత్నవరవడికి శ్రీకారం చుట్టి సేద్యపు కుంటల్లో చేపల సాగుకు వినియోగించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ప్రస్తుతం పంట కుంటల ద్వారా అదనపు అదాయాన్ని పొందుతున్నారు.

నీటి కుంటల ద్వారా నీటి ఎద్దడి తగ్గటంతోపాటు, భూగర్భజలాలు బాగా పెరిగాయి. నీటి కుంటల్లో చేపలను పెంచటం వల్ల వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేపల విసర్జించే వ్యర్ధాలతో కూడిన నీటిని పంటలకు అందించటం ద్వారా ఎరువుల వినియోగం తగ్గించుకుంటున్నారు. తక్కువ ప్రదేశంలో నీటి కుంటల్లో చేపలను పెంచటం వల్ల ప్రతిఏటా సాగు ద్వారా వచ్చే అదాయానికి తోడు చేపల అమ్మకాల ద్వారా అదనంగా అదాయం లభిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

ఇప్పటికే పంట కుంటల ద్వారా అదనపు అదాయాన్ని పొందుతున్న రైతులను చూసిన ఇతర రైతులు సైతం తమ పొలాల్లో పంటకుంటలు తవ్వుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నీటి కుంటల్లో చేపలు పెంచటం వల్ల , ఆ నీటిని పంట పొలాలకు అందించటం ద్వారా పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధానం వల్ల భవిష్యత్తులో రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.