ఫిబ్రవరి 15నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి, లేదంటే జేబుకి చిల్లే.. ఎలా పని చేస్తుంది? ఎక్కడ పొందొచ్చు? ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

ఫిబ్రవరి 15నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి, లేదంటే జేబుకి చిల్లే.. ఎలా పని చేస్తుంది? ఎక్కడ పొందొచ్చు? ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

fastag must for four wheeler vehicles: ఫిబ్రవరి 15 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను(FASTag) తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి, రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాహనదారులు జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజా దాటుకుని వెళ్లాలంటే కేవలం ఫాస్టాగ్ ద్వారానే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మాత్రం రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ గడువు తేదీ దగ్గర పడుతుండటంతో ఈ కొత్త విధానంపై కేంద్రం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కేంద్రం ప్రకటనలు ఇస్తుంది. కానీ కొత్త ఫాస్టాగ్ విధానంపై చాలా మందికి పలు సందేహాలున్నాయి.

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా తమ గమ్యస్థానాలను చేరేందుకు ఫాస్టాగ్ విధానం తీసుకొచ్చారు. ఈ ఫాస్టాగ్ (FASTag) విధానంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విధానాన్ని కూడా ప్రోత్సహించబడుతుంది. ఫాస్టాగ్ అనగా వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు. కాగా, ఇది జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది.

ఫాస్టాగ్ ఎలా పని చేస్తుంది?
* వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్.
* ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు.
* ఈ ఫాస్టాగ్ బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌తో లింక్ చేయబడుతుంది.
* టోల్ చెల్లించడానికి వాహనం ఆపాల్సిన పని లేదు.

ఫాస్టాగ్ ఎక్కడ పొందొచ్చు?
* ఫాస్టాగ్ లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* దీనికోసం ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.
* టోల్ ప్లాజా, ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
* అలాగే “మై ఫాస్టాగ్” యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కూడా ఫాస్టాగ్ ను అందిస్తున్నాయి.

ఫాస్టాగ్ లో ఏముంటుంది? ఎక్కడ అతికిస్తారు? ఎంత కాలం చెల్లుతుంది?
* ఈ ఫాస్టాగ్ లో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది.
* ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు.
* కాగా, ఇది జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది.
* దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు “మై ఫాస్ట్ ట్యాగ్” మొబైల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఈ యాప్ లో మీ వివరాలు, ఫాస్టాగ్ వివరాలు సమర్పించిన తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఆర్‌సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోవచ్చా?
ఆర్‌సి(రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) లేకుండా ఫాస్టాగ్ తీసుకోలేము. ఫాస్టాగ్ తీసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి.

ఫాస్ట్ ట్యాగ్ బదిలీ చేయవచ్చా?
మీ వాహనం యొక్క ఫాస్టాగ్ మరెవరికీ బదిలీ చేయకూడదు. మీరు వాహనాన్ని విక్రయిస్తుంటే మీ వాహనం యొక్క ఫాస్టాగ్ ఖాతాను నిలిపివేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?
ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్ ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ల ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్ ను రీచార్జి చేసుకోవచ్చు.

ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి ఎవరికి మినహాయింపు?
* న్యాయమూర్తులు
* రాజకీయ నాయకులు
* ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్ ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు.
* వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది.

టోల్‌ గేట్ల దగ్గర సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరి చేశారు.