Apple Tea : కొవ్వును కరిగించే యాపిల్,అల్లం టీ..

యాపిల్ టీని ప్రతిరోజు తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.

Apple Tea : కొవ్వును కరిగించే యాపిల్,అల్లం టీ..

Apple Tea

Apple Tea : అధిక బరువు, అధిక మొత్తంలో కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. ఇందుకోసం చాలా మంది వివిధ రకాల పద్దతులు ఫాలో అవుతుంటారు. జిమ్ కు వెళ్ళడం, వ్యాయామం చేయడం వంటి చేసేవారు కొందరైతే ప్రకృతి సిద్ధంగా సులభమైన మార్గంలో కొవ్వులు తగ్గించుకునేందుకు ప్రయత్నించేవారు మరికొందరు. ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో బరువు తగ్గాలనుకునే వారికి యాపిల్ టీ చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

అధిక బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగుతూ ఉంటారు. అయితే ఇకపై ఆపిల్, అల్లం కలగలిపిన టీని తాగడం అలవాటు చేసుకుంటే ఇక ప్రతిరోజు ఆ టీని తాగేందుకు ఇష్టపడతారు. ఇలా రోజువారిగా యాపిల్ ,అల్లం తో తయారైన టీని తాగటం ద్వారా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ ఫ్రెండ్లీ డైట్ గా పిలవబడే ఈ హెర్బల్ టీ ,ఆపిల్ ,అల్లం టీ, గ్రీన్ టీ వంటివి ఒకవైపు బరువు తగ్గించడంతో పాటు, నీరసం రాకుండా కాపాడుతూ ఉంటాయి.

యాపిల్ టీని ప్రతిరోజు తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా, సరైన రుచిని కూడా మనం ఆస్వాదించవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండి, అధిక మొత్తంలో ఫైబర్ ను కలిగి ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

ఇందుకుగాను ముందుగా యాపిల్ , అల్లం తొక్కలను తీసి బాగా చితక్కొట్టి నీటిలో ఉడికించాలి. నీటిలో ఉడికిన తర్వాత కాసేపు చల్లార్చాలి. ఆతరువాత స్మూత్ జ్యూస్‌లా అయ్యేవరకూ గ్రైండ్ చెయ్యాలి. ఇక యాపిల్ టీ రెడీ అయిపోయినట్టే… ఈ టీని ఉదయం పరగడుపున తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. చక్కటి ఫ్లేవర్ మాత్రమే కాదు… ఈ రుచికరమైన టీ తాగిన ఫీలింగ్ కలుగుతుంది. బరువు సైతం సునాయాసంగా తగ్గిపోతారు.