Female Population Increased : మొదటిసారి దేశంలో..మగవారికంటే మహిళల సంఖ్య పెరిగింది..

మొదటిసారి దేశంలో..మగవారికంటే మహిళల సంఖ్య పెరిగింది..తొలిసారిగా 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1020కి పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలు తెలిపాయి.

Female Population Increased : మొదటిసారి దేశంలో..మగవారికంటే మహిళల సంఖ్య పెరిగింది..

India Female Population Increased

India Female Population Increased  : భారతదేశంలో ఇంతకాలానికి లింగ నిష్పత్తి (sex ratio) పెరిగింది. ఇది భారత్ కు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. మగవారికంటే మహిళ సంఖ్య పెరిగింది. ఇది నిజంగా మంచి వార్తే. 2015-16లో నిర్వహించిన NFHS-4లో, ఈ సంఖ్య 1000 మంది పురుషులకు 991 మంది స్త్రీలుగా ఉంది.కానీ ఆ సంఖ్య పెరిగింది. భారతదేశంలోని మొత్తం జనాభాలో తొలిసారిగా 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1020కి పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలను బుధవారం (నవంబర్ 24) విడుదల చేసింది జాతీయ కుటుంబ సర్వే.

అంతేకాదు..బాలబాలిక లింగ నిష్పత్తి కూడా మెరుగుపడింది. 2015-16లో 1000 మంది బాలురకు 919 మంది బాలికలు ఉన్నారు. కానీ ఇప్పుడా సంఖ్య మెరుగుపడింది. తాజా సర్వేలో 1000 మంది మగపిల్లలకు 929 మంది ఆడపిల్లలు ఉన్నట్లుగా తేలింది. అంటే సంఖ్యలో మెరుగుదల కనిపించింది. మరొకటి..దేశంలో మొత్తం జనాభాలో ఈ లింగ నిష్పత్తి నగరాల్లో కంటే గ్రామాల్లో మెరుగుపడం విశేషం. గ్రామాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 1037 మంది మహిళలు ఉండగా.. నగరాల్లో 985 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.

Read more : ఆ టౌన్లో అంతా అందమైన అమ్మాయిలే..కానీ పెళ్లి చేసుకోవట్లేదు..కారణం వెనుక పెద్ద కథే

దేశంలోనే తొలిసారిగా తగ్గిన సంతానోత్పత్తి రేటు
అలాగే దేశంలో తొలిసారిగా సంతానోత్పత్తి రేటు 2కి తగ్గింది. 2015-16లో ఇది 2.2. ప్రత్యేక విషయం ఏమిటంటే, సంతానోత్పత్తి రేటు 2.1 భర్తీ గుర్తుగా పరిగణిస్తారు. అంటే..ఒక జంట ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంటే, ఆ ఇద్దరు పిల్లలు వారి స్థానంలో ఉంటారు. 2 కంటే తక్కువ పిల్లలను కలిగి ఉండటం అంటే జనాభా తగ్గిపోతుందని భావిస్తున్నారు. జనాభా పెరుగుదల 2.1 సంతానోత్పత్తి రేటు వద్ద స్థిరంగా ఉంటుంది.

సంఖ్యలో మెరుగుపడ్డా విద్యలో లేదు..
జనాభాలో మహిళల నిష్పత్తి పెరిగింది.ఇది మంచి విషయమే. కానీ చదువు విషయంలో ఆశాజనకంగా లేదు. 41% మంది మహిళలు మాత్రమే 10 సంవత్సరాల కంటే ఎక్కువ విద్యను పొందారు. ఇప్పటివరకు వారి పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. ఈనాటికి కూడా దేశంలోని 41% మంది మహిళలు 10 సంవత్సరాల కంటే ఎక్కువ పాఠశాల విద్యను పొందిన వారు, అంటే వారు 10 వ తరగతి దాటి చదవగలుగుతున్నారు.

అలాగే..59% మంది మహిళలు 10వ తరగతికి మించి చదవలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 33.7% మంది మహిళలు మాత్రమే 10వ తరగతి దాటి చదవగలరు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్లల విద్యలో ఇంకా వెనుకబడే ఉంటడం విచారించాల్సిన విషయం. ఈ కంప్యూటర్ యుగంలో కేవలం 33.3% మంది మహిళలకు మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మిగిలినవారు టెక్నాలజీ అందుబాటులో లేదు.

Read more : పురుషులే లేని గ్రామం..మహిళలకు పిల్లలెలా పుడతారు?సంబురు తెగ చరిత్ర

బ్యాంకు ఖాతాలున్న మహిళలు..
సొంతగా బ్యాంకు ఖాతా ఉన్న మహిళల సంఖ్య 25% పెరిగింది. దేశంలో 78.6% మహిళలు తమ సొంత బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్నారు. 2015-16లో ఈ సంఖ్య 53% మాత్రమేగా ఉండగా అది ఇప్పుడు పెరిగింది. మహిళలకు ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్న క్రమంలో బ్యాంకు ఖాతాలు అవసరంగా మారటం కూడా ఈ పెరుగుదలకు కారణం అనుకోవచ్చు.

Read more : మహిళాధిక్య గ్రామాల్లో రోగాలు తక్కువ.. పురుషులు హ్యాపీ

అదే సమయంలో, 43.3% మంది మహిళలు తమ పేరు మీద కొంత ఆస్తిని కలిగి ఉన్నారు. అయితే, 2015-16లో ఈ సంఖ్య 38.4% మాత్రమే. రుతుస్రావం సమయంలో సురక్షితమైన పారిశుద్ధ్య చర్యలను అనుసరించే మహిళలు 57.6% నుంచి 77.3%కి పెరిగారు. అయినప్పటికీ, పిల్లలు.. స్త్రీలలో రక్తహీనత ప్రధాన ఆందోళన కలిగించేదిగా మారింది. 67.1% మంది పిల్లలు.. 57% మంది స్త్రీలు 15 నుంచి 49 సంవత్సరాల మధ్య రక్తహీనతతో బాధపడుతున్నారు.