మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’.. లుక్ కిరాక్..

మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’.. లుక్ కిరాక్..

Mohan Babu: కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు.. 560 చిత్రాల‌కు పైగా చిత్రాల్లో క‌థానాయ‌కుడు, ప్ర‌తి నాయ‌కుడు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించ‌డ‌మే కాకుండా.. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ స్థాపించి నిర్మాత‌గా కూడా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్‌బాబు సినిమాలు చాలా సెల‌క్టివ్‌గా చేస్తూ వ‌స్తున్నారు.

https://10tv.in/mohan-babu-announcing-son-of-india/

మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘సన్నాఫ్ ఇండియా’.. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. మోహ‌న్‌బాబు లుక్‌, గెటప్ ఆకట్టుకుంటున్నాయి. మరోసారి తన మార్క్ ఫైర్ వెండితెరపై చూపించనున్నారనిపిస్తోంది. ఖాధీ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాలతో మోహన్ బాబు లుక్ డైనమిక్‌గా, గంభీరంగా ఉంది..

‘సన్నాఫ్ ఇండియా’ పోస్టర్ చూసిన తర్వాత ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమా గుర్తొచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

Son Of India