హిస్టరీలో ఫస్ట్‌టైమ్.. ఓటీటీకి ఫిల్మ్‌ఫేర్..

హిస్టరీలో ఫస్ట్‌టైమ్.. ఓటీటీకి ఫిల్మ్‌ఫేర్..

Filmfare OTT awards: 2020 .. సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టాల్ని తెచ్చిపెట్టింది. ఎంతో మందికి ఉపాధి లేకుండా చేసింది. మరో వైపు సరికొత్త టాలెంట్‌‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రతిభని గుర్తించి ప్రోత్సాహకంగా అవార్డులు ఇచ్చేలా చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులొచ్చినా.. బ్లాక్ లేడీ వస్తే ఆ కిక్కే వేరు. అలాంటి ప్రెస్టీజియస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్ని ఈ సారి స్మాల్ స్క్రీన్‌కి తీసుకొచ్చారు మేకర్స్.

లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ఈ పదాలు కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాయి. లాక్ డౌన్‌తో కరోనా భయం కారణంగా షూటింగ్స్, సినిమా థియేటర్ల జోలికి వెళ్లలేదు ఎవ్వరూ. కానీ మరో వైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సిరీస్‌లతో, షోస్ తో తెగ హంగామా చేసేశాయి ఓటీటీలు. కరెక్ట్ టైమ్ చూసుకుని ఎంట్రీ ఇచ్చిన ఓటీటీ సిరీస్‌లు సినిమాల కన్నా పెద్ద సక్సెస్ అందుకున్నాయి. అంతేకాదు సినిమా వాళ్లు అందుకునే ఫిల్మ్‌‌ఫేర్ అవార్డ్స్‌ని ఎక్స్‌క్లూజివ్‌గా ఫస్ట్ టైమ్ డిజిటల్ మీడియలో ఓటీటీ షోస్ గెలుచుకున్నాయి.

Filmfare OTT awards 2020

ఈ సంవత్సరం ఓటీటీ హవా అంతా ఇంతా కాదు . లాక్ డౌన్ టైమ్‌లో ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేసింది కంప్లీట్‌గా డిజిటల్ మీడియా సిరీస్, షోస్ అనే చెప్పుకోవాలి. వాటిలో ది బెస్ట్ సిరీస్‌లకి, యాక్టర్స్‌కి ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్అందించింది ఫిల్మ్‌ఫేర్. ఈ హిట్ సిరీస్‌లతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు అందరూ. లేటెస్ట్‌గా జరిగిన ఈ ఫిల్మ్‌ఫేర్ డిజిటల్ అవార్డ్ ఫంక్షన్ బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో మెరిసిపోయింది.

Filmfare OTT awards 2020

సౌత్ యాక్ట్రెస్ ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయ్ జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’ ఫిల్మ్‌ఫేర్స్ గెలుచుకుని మోస్ట్ వ్యూడ్‌ సిరీస్‌గా నిలిచింది. ‘ది ఫ్యామిలీ మెన్’ తో పాటు .. ‘పాతాల్‌ లోక్’ హవా కంటిన్యూ చేసింది. బెస్ట్ డ్రామా సిరీస్‌తో పాటు బెస్ట్ డైరెక్టర్ అవార్డుల్ని గెలుచుకుంది. ఈ సిరీస్ అనుష్క శర్మ ప్రొడక్షన్‌లో తెరకెక్కింది.

Filmfare OTT awards 2020

ఇక బెస్ట్ క్రిటిక్స్ డైరెక్టర్, బెస్ట్ క్రిటిక్స్ సిరీస్ అవార్డుల్ని ‘ద ఫ్యామిలీ మెన్’ తన అకౌంట్‌లో వేసుకుంది. ఇక ‘పంచాయత్’, ‘ఆర్య’, ‘లిటిల్ థింగ్స్ (సీజన్ 3)’, ‘పుష్ప వల్లి (సీజన్ 2)’, ‘బ్రీత్ ఇన్ టూ ద షాడోస్’ ఇలా ప్రతి సిరీస్ తన ప్రత్యేకతను చాటుకుని అవార్డుల్ని గెల్చుకున్నాయి. హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఇలా స్మాల్ స్క్రీన్‌కి ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఇచ్చి న్యూస్ మేకర్ అయ్యింది ఫిల్మ్‌ఫేర్.

Filmfare OTT awards 2020