Lockdown: ఫార్మసీ సిబ్బందికి ఫైన్.. నడిరోడ్డుపై యువతి హల్చల్!

కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ అమలులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కొందరు పోలీసులు అతిగా ప్రవర్తించడం.. అనుమతి ఇచ్చిన రంగాల సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టడం, చేయిచేసుకోవడం వంటి అంశాలతో పలుమార్పు వివాదాస్పదమైంది.

Lockdown: ఫార్మసీ సిబ్బందికి ఫైన్.. నడిరోడ్డుపై యువతి హల్చల్!

Fine For Pharmacy Staff In Vizag Young Woman Hustle On The Road

Lockdown: కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ అమలులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కొందరు పోలీసులు అతిగా ప్రవర్తించడం.. అనుమతి ఇచ్చిన రంగాల సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టడం, చేయిచేసుకోవడం వంటి అంశాలతో పలుమార్పు వివాదాస్పదమైంది. తాజాగా విశాఖలో ఓ ఫార్మసీ సిబ్బంది, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తనకు పాస్ ఉన్నా ఫైన్ వేయడం ఏమిటని యువతి రోడ్డుపై కూర్చొని నిరసన వరకు వెళ్లడంతో ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Lockdown

Lockdown

విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తూ సాయంత్రం కర్ఫ్యూ కారణంగా ఆమె సోదరుడు లేదా స్నేహితుడు వచ్చి ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి ఆమెకి అన్ని అనుమతులు కూడా ఉన్నాయి. శనివారం రాత్రి సమయంలో ఆమెను తీసుకెళ్లడానికి వస్తున్న ఆమె స్నేహితుడిని ఆపిన పోలీసులు జరిమానా విధించారు. జరిమానా విషయం ఆమె ఫోన్ కు మెసేజ్ కూడా వచ్చింది.

దీంతో ఇంటికి వెళ్లే సమయంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పాస్ ఉన్నప్పటికీ తన వాహనానికి ఎలా ఫైన్ వేశారని ఆమె పోలీసులను ప్రశ్నించింది. ఇలా ప్రతిరోజు వాహనానికి జరిమానా వేస్తే తన జీతం మీకే సరిపోతుందని ఆమె గట్టిగా వాదించారు. వాహనాల తనిఖీ సమయంలో యువకుడు ఎలాంటి పత్రాలు చూపించలేదని పోలీసులు ఆరోపించారు. చివరికి వాదన పెద్దదవడంతో పోలీసులు ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించారు. మహిళా పోలీసులు అపర్ణను నిలువరించేందుకు ప్రయతించగా ఆమె రోడ్డుపై ఆందోళనకు దిగారు.

Lockdown

Lockdown

ఈ సమయంలో ఆమె మహిళా పోలీసులను ప్రతిఘటించడంలో తోపులాట జరగడం, పెద్ద ఎత్తున జనాలు పొగడడంతో ఆమెను పోలీసులు వాహనంలోకి ఎక్కించి స్టేషన్ కు తరలించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆమె మహిళా పోలీసులను సైతం వెనక్కు నెట్టి రోడ్డుపైనే ఆందోళనకు దిగింది. పాస్ ఉన్నా ఫైన్ ఎందుకు వేశారని.. ఏ తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ఆమె పోలీసులతో వాదనకి దిగారు. ఆమెకి డ్రంకెన్ టెస్టు నిర్వహించాలని సీఐ ఆదేశించడంతో.. ఆమె మీ పోలీసులే మద్యం సేవించి ఇలా పాసులు ఉన్న వారికి జరిమానాలు విధిస్తున్నారని వాదనకు దిగారు. కాగా, ఆమె, తన స్నేహితుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించి మహిళా పోలీసులను గాయపరిచారని వాదిస్తున్న పోలీసులు ఈ మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.