Punjab CM Bhagwant Mann : తగ్గేదేలే.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికే రూ.10వేల జరిమానా వేసిన మున్సిపల్ అధికారులు

రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా పదవుల్లో ఉన్న వారికైనా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికే అధికారులు భారీ జరిమానా విధించారు.

Punjab CM Bhagwant Mann : తగ్గేదేలే.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికే రూ.10వేల జరిమానా వేసిన మున్సిపల్ అధికారులు

Punjab Cm Bhagwant Mann (1)

Punjab CM Bhagwant Mann : రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా అత్యున్నత పదవుల్లో ఉన్న వారైనా సరే.. అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. అంతా రూల్ ఫాలో అవ్వాల్సిందే. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. పంజాబ్ లో అదే జరిగింది. అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముఖ్యమంత్రి అని కూడా చూడలేదు. తప్పు చేశారని రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు. ఏకంగా సీఎం ఇంటికే ఫైన్ వేశారు.

Bhagwant Mann: అవినీతి నాయకుల జాబితా సిద్ధమైంది.. వాళ్లు జైలుకెళ్లడం ఖాయం..

అవును.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి జరిమానా విధించారు. చెత్త పారబోశారంటూ చండీగఢ్ లోని సీఎం భగవంత్ మాన్ నివాసానికి రూ.10 వేల జరిమానా వేశారు చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. ఇందులో పంజాబ్ సీఎం ఇంటి చిరునామా స్పష్టంగా పేర్కొన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధు స్పందించారు. సీఎం నివాసం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. చెత్తను రోడ్డు మీద పారవేయొద్దని సీఎం నివాసంలోని వారికి మున్సిపల్ సిబ్బంది పలుమార్లు చెప్పినా ఫలితం కనిపించలేదని వివరించారు. ఈ క్రమంలోనే ఫైన్ విధిస్తూ చలాన్ జారీ అయిందని తెలిపారు.