Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్

అనుమతి తీసుకోకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను, రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్

Fine To Bjp

Fine To BJP: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు డిజిటల్ డిస్‌ప్లే ఏర్పాటు చేసినందుకుగాను బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్ విధించింది. ‘సాలు దొరా.. సెలవు దొరా’ అంటూ నాంపల్లిలోని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ భవన్ వద్ద డిజిటల్ బోర్డును బీజేపీ ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో సూచిస్తూ, కౌంట్‌డౌన్ అంటూ ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

అయితే దీనికి అనుమతులు తీసుకోలేదు. దీంతో జీవో నెంబర్ 68 ప్రకారం.. అనుమతి తీసుకోకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను, రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ, డిజిటల్ బోర్డు తొలగించేందుకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో జరిమానా విధించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరిట అధికారులు ఈ జరిమానా జారీ చేశారు.

Kotha Prabhakar Reddy: పేదల భూములు ఆక్రమించిన ఈటల: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఈ డిస్‪ప్లేతోపాటు అక్కడే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాలతో కూడిన బ్యానర్లు, కటౌట్లు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. వీటికి కూడా అధికారులు మరో జరిమానా విధించారు. ఫైన్ వేసినప్పటికీ, అధికారులు డిస్ ప్లే బోర్డు, బ్యానర్లను తొలగించలేదు.