Unlimited store: రూ.6.25 కోసం కోర్టుకెక్కి.. రెండేళ్ల తర్వాత విజయం!

మాల్స్‌లో, రీటైల్ స్టోర్స్‌లో క్యారీ బ్యాగ్‌లపై వారి లోగోలను వేసుకుని, వాటిని ఉచితంగా కాకుండా విక్రయించడం గమనిస్తూనే ఉంటాం..

Unlimited store: రూ.6.25 కోసం కోర్టుకెక్కి.. రెండేళ్ల తర్వాత విజయం!

Unlimited Store

Fine to Unlimited store: మాల్స్‌లో, రీటైల్ స్టోర్స్‌లో క్యారీ బ్యాగ్‌లపై వారి లోగోలను వేసుకుని, వాటిని ఉచితంగా కాకుండా విక్రయించడం గమనిస్తూనే ఉంటాం. అదే పద్దతిలో క్యారీ బ్యాగ్‌ను అమ్మినందుకు అన్‌లిమిటెడ్‌ స్టోర్‌కు జరిమానా విధించింది వినియోగదారుల హక్కుల కోర్టు.

హైదరాబాద్ నగరంలోని జామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఎస్ ఉమేష్ కుమార్ అనే వ్యక్తి ఏఎస్ రావు నగర్‌లోని అన్‌లిమిటెడ్‌ స్టోర్‌లో 1,198రూపాయలు ఖర్చుపెట్టి రెండు జీన్స్‌ ప్యాంట్లను 2019 ఏప్రిల్‌లో కొన్నారు. బిల్లు చేతికిచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్‌కు కూడా స్టోర్ రూ.6.25 వసూలు చేసింది.

అన్‌లిమిటెడ్‌ లోగో ఉన్న సంచికి డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు స్టోర్ వాళ్లు. లోగో లేని సంచి ఇవ్వాలని కోరగా అటువంటి పని చెయ్యలేదు.

దీంతో ఉమేశ్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. అప్పటి నుంచి విచారించిన రంగారెడ్డి జిల్లా కమిషన్‌ రూ.6.25 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,500, కేసు ఖర్చుల నిమిత్తం రూ.1,000, ముప్పై రోజుల్లోగా కస్టమర్‌కు చెల్లించాలని అన్‌లిమిటెడ్‌ స్టోర్‌ను ఆదేశించింది.