Fake Baba: 10టీవీ ఎఫెక్ట్… ఫేక్ బాబాపై కేసు నమోదు
హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్‌ట్రాక్షన్ కింద ఫేక్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 290, 341 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Fake Baba (1)
Fake Baba: తన పార్టీ సభ్యత్వం తీసుకుంటే 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తానంటూ నమ్మించిన ఫేక్ బాబా భగవాన్ అనంత విష్ణు దేవ ప్రభు అలియాస్ రామ్ దాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్‌ట్రాక్షన్ కింద ఫేక్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 290, 341 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ‘జై మహా భారత్ పార్టీ’లో చేరితే ఇండ్ల స్థలాలు ఇస్తానంటూ పార్టీ వ్యవస్థాపకుడు ఫేక్ బాబా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పార్టీపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్
ఈ అంశంపై సైఫాబాద్ పోలీసులు ఈసీకి లేఖ రాశారు. మరోవైపు ప్రజల నుంచి భారీ ఎత్తును ఆధార్ కార్డులు సేకరించడంపై కూడా ఫిర్యాదు చేశారు. కేసు విచారణ తర్వాత ఫేక్ బాబాపై మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది. ఉచిత ఇళ్ల స్థలాల పేరుతో దాదాపు ఐదు లక్షల ఇండ్ల స్థలాలు సేకరించినట్లు సమాచారం. 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పడంతో చాలా మంది తమ ఆధార్ కార్డులు ఇచ్చారు.