Fire In Delhi Hospital : ఢిల్లీ బ్రహ్మశక్తి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..రోగి మృతి

ఢిల్లీలోని బ్రహ్మ శక్తి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) వార్డులో ఐసీయూ వార్డులో మంటలు చెలరేగడంతో ఓ రోగి మృతి చెందాడు.

Fire In Delhi Hospital : ఢిల్లీ బ్రహ్మశక్తి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..రోగి మృతి

Delhi Brahm Shakti Hospital Fire Accident

delhi brahm shakti hospital fire accident : ఢిల్లీలోని బ్రహ్మ శక్తి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) వార్డులో ఐసీయూ వార్డులో శనివారం (జూన్ 2022) మంటలు చెలరేగడంతో ఓ రోగి మృతి చెందాడు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 9 అగ్నిమాపకశాఖ వాహనాలతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి సహాయక చర్యల్ని చేపట్టారు. ఆస్పత్రిలోని మిగిలినవారిని ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రక్షించారు ఫైర్ సిబ్బంది.

ఈ ప్రమాదంపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. వెంటిలేటర్‌పై ఉన్న ఒకరిని మినహాయించి భవనం లోపల ఉన్న రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఓ రోగి మృతి చెందాడని తెలిపారు. కాగా బ్రహ్మశక్తి ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది..