Stuartpuram Donga : భయపెడుతున్న ‘స్టూవర్ట్ పురం దొంగ’
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’.
Stuartpuram Donga : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రకటించిన కొద్దిగంటల్లోనే ఈ మూవీ అప్డేట్స్లో స్పీడ్ పెరిగింది. దీంతో.. స్టూవర్ట్ పురం సినిమాల హంగామా ఇండస్ట్రీలో అలర్ట్ క్రియేట్ అయింది.
చదవండి : Raviteja – Bellamkonda : ఒకేసారి రెండు బయోపిక్స్.. టైగర్ నాగేశ్వరరావు మీద ఎందుకింత క్రేజ్!
దీపావళి కానుకగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు రైఫిల్స్‌ని చేతపట్టిన శ్రీనివాస్ హాలీవుడ్ హీరోను తలపించేలా ఉన్నాడు. మేడలో పులిగోరుతో భయం గొలిపే రీతిలో ఉంది పోస్టర్.
ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. టైగర్ బయోపిక్‌ని బెల్లంకొండ శ్రీనివాస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ యంగ్ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
చదవండి : Bellamkonda Sai Srinivas : గజదొంగ బయోపిక్‌లో బెల్లంకొండ.. టైటిల్ ఫిక్స్