భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మొదటి భార్య, నిజం తెలిసి అతడిని ఉతికారేసిన రెండో భార్య

భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మొదటి భార్య, నిజం తెలిసి అతడిని ఉతికారేసిన రెండో భార్య

first wife caught husband red handed: కట్టుకున్న భార్య, ఎదిగిన పిల్లలుండగా.. మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు పరుశురాం అనే ప్రబుద్దుడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కాగా, తనకు ఎవరూ లేరని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరూ కలిసి అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పరుశురామ్ కి బోర్ వెల్ వాహనాలు ఉన్నాయి. బోర్ వెల్ పనుల మీద వెళ్తున్నానంటూ బయటకు వెళ్లిన భర్త… రెండు మూడు రోజుల వరకు ఇంటికి వచ్చే వాడు కాదు. ఆ తర్వాత వారం రోజుల వరకు వచ్చే వాడు. మెల్ల మెల్లగా అసలు ఇంటికి రావడం మానేశాడు. ఏకంగా మూడు నెలల పాటు కనీసం ఇంటి ముఖం చూడకపోవడంతో భర్త మీద మొదటి భార్యకు అనుమానం వచ్చింది. ఏదో తేడా జరుగుతోందని గ్రహించింది. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన భర్త మళ్లీ తాను పని మీద వెళ్తున్నానని చెప్పడంతో సరే అంది.

భర్త ఎటు వెళ్తున్నాడో తెలుసుకునేందుకు మొదటి భార్య ప్లాన్ చేసింది. అతడు ఇంటి నుంచి బయలుదేరి.. కామారెడ్డి జిల్లాలో కాపురం పెట్టిన రెండో భార్య దగ్గరకు వెళ్లాడు. దీంతో మొదటి భార్యకు విషయం అర్థమైంది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంది. బంధువులను వెంటపెట్టుకుని బయలుదేరింది. తన భర్త రెండో భార్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ తర్వాత నా భర్తే కావాల్సి వచ్చాడా అంటూ ఆమె రెండో భార్య మీద దాడి చేయబోంది. కానీ, అక్కడే అసలు విషయం తెలిసింది.

రెండో భార్య షాకింగ్ విషయం చెప్పింది. పరుశురాం అసలు పెళ్లి కాలేదని చెప్పాడని, అందుకే తాను పెళ్లి చేసుకున్నానని అంది. నన్ను కూడా మోసం చేశాడంటూ అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఇద్దరు భార్యలు కలిసి తమను మోసం చేసిన భర్తను చితక్కొట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.