Danger Fish : వర్షంలో చేపలు.. వండుకు తింటున్న జనాలు.. మంచిదేనా?

వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?

Danger Fish : వర్షంలో చేపలు.. వండుకు తింటున్న జనాలు.. మంచిదేనా?

Fish Rain (1)

Danger Fish : వాన వస్తే వరద వస్తుంది. ఇది చాలా కామన్. కానీ, తెలంగాణలోని కొన్ని చోట్ల ఇందుకు భిన్నంగా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చేపలు వర్షంలా కురుస్తున్నాయి. మేఘాల నుంచి నల్లటి చేపలు తెప్పలు తెప్పలుగా నేల మీద పడుతున్నాయి. అంత ఎత్తు నుంచి కింద పడినా అవి బతికే ఉంటున్నాయి. చేపల వర్షాన్ని చూసి జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎంచక్కా కింద పడుతున్న చేపల్లో పెద్దగా ఉండే వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారు. టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ వండుకుని తింటున్నారు. అయితే, ఫ్రీగా దొరికాయి కదా అని వాటిని ఎంచక్కా వండుకుని తింటున్నారు సరే.. అసలు ఆ చేపలు తినొచ్చా? ఆరోగ్యానికి ముప్పు లేదా? అని ఎవరూ ఆలోచన చేయడం లేదు.

Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం

మ్యాటర్ ఏంటంటే.. ఆ చేపలు తింటే డేంజర్ అనే విషయం మీకు తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ మాట మేము అనడం లేదు. స్వయంగా జువాలజీ ప్రొఫెసర్లే అంటున్నారు.

Cat Fish Tension : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్యాన్సర్ ముప్పు తెచ్చే క్యాట్ ఫిష్ కలకలం

అసలు వర్షంగా కురుస్తున్న చేపలన్నీ మేఘాల నుంచి కిందకు పడేవి కాదు. ఆకాశంలో చేపలు ఉండటం అసాధ్యం. వర్షాకాలం ప్రారంభంలో చెరువులు, కుంటల్లో లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఆ సమయంలో యాంఫీబియస్ నేచర్ ఉన్న నల్లటి చేపలు గాల్లోకి ఎగురుతాయి. వీటికి నేల మీద, నీటి మీద బతికే శక్తి ఉంటుంది. వర్షం, గాలి వచ్చిన సమయంలో ఇవి గాల్లోకి ఎగిరి మళ్లీ వర్షంతో పాటు కిందకు పడతాయి. దీన్ని చూసి చేపల వర్షం కురిసిందని జనాలు ఆశ్చర్యపోతుంటారు.

Fish Rain : తెలంగాణలో వింత.. మళ్లీ చేపల వర్షం, ఆశ్చర్యంలో జనం

సాధారణంగా రసాయనాలు వదిలే ఫ్యాక్టరీల సమీపంలో ఉండే చెరువులు, కుంటలు కలుషితం అవుతాయి. అలాంటి వాటిల్లో నల్లటి చేపలు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షం పడుతున్న సమయంలో రసాయనాల ఎఫెక్ట్ తో చేపలకు ఒక్కోసారి ఆక్సిజన్ అందదు. దీంతో అవి గాల్లోకి ఎగురుతుంటాయి. గాల్లోకి ఎగిరిన చేపలు వర్షాలకు ఎదురీది రోడ్లు పొల్లాల్లోకి వస్తాయి. వీటిని జనాలు వండుకు తింటే ప్రాణాలకే ప్రమాదం అని జువాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అంతేకాదు చేపల వర్షం అనేది మనం క్రియేట్ చేసుకున్నదే అని కూడా చెబుతున్నారు. పరిశ్రమల రసాయనాల ద్వారా నీరు కలుషితం అయిన ప్రాంతాల్లో పడిన చేపలు తినడం ఎంతమాత్రమూ మంచిది కాదన్నారు జువాలజీ ప్రొఫెసర్ డీఈ బాబు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw