Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు... ఐదుగురు మృతి Five Killed On Way to Bareilly as Car Crashes Into Truck After Tyre Burst

Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.

Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి

Car Accident: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలి పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ కారును అదుపు చేయలేకపోవడంతో వేగంగా వెళ్లి, ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొంది.

Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?

ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులంతా 30-40 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. మృతులను మొహమ్మద్ సాగిర్, మొహమ్మద్ తాహిర్, ఇమ్రాన్ ఖాన్, మోహమ్మద్ ఫరీద్‌గా గుర్తించారు. ఘటన సమాచారాన్ని మృతుల బంధువులకు తెలియజేశారు.

×