Election Results 2021 : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన పార్టీలు

దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాంలో అధికార పార్టీల హవానే కొనసాగుతోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.

Election Results 2021 : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన పార్టీలు

Election Results 2021

Five States Election Results 2021 : దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాంలో అధికార పార్టీల హవానే కొనసాగుతోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.

బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. అక్కడ మొత్తం 292 నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతుండగా.. టీఎంసీ ప్రస్తుతం 187 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 98 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఇక తమిళనాడులో డీఎంకే కూటమి జోరు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలుండగా ప్రస్తుతం ఈ కూటమి 139 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అధికార అన్నాడీఎంకే కూటమి 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

కేరళలో అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి హవా సాగిస్తోంది. మొత్తం 140 స్థానాలకు గానూ.. ఈ కూటమి 87 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అస్సాంలో మొత్తం 126 స్థానాలకు గానూ.. అధికార బీజేపీ కూటమి 78 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 38 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. పుదుచ్చేరిలో(30 స్థానాలు) బీజేపీ 12 చోట్ల, కాంగ్రెస్‌ కూటమి 5 చోట్ల ముందంజలో ఉంది.