Mangaluru: గల్‌ఫ్రెండ్‌తో యువకుడి చాటింగ్.. ఆరు గంటలు నిలిచిపోయిన విమానం

ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు సరదాగా పంపిన మెసేజ్ విమానం నిలిచిపోయేందుకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం జరిగింది. ఇంతకీ ఇద్దరి మధ్యా జరిగిన చాటింగ్ సంగతి ఏంటంటే..

Mangaluru: గల్‌ఫ్రెండ్‌తో యువకుడి చాటింగ్.. ఆరు గంటలు నిలిచిపోయిన విమానం

Mangaluru: ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన చాటింగ్ విమానం నిలిచిపోయేందుకు కారణమైంది. విమాన ప్రయాణికుల్ని, ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని భయపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగష్టు 14 ఆదివారం మధ్యాహ్నం మంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒక విమానం మంగళూరు నుంచి ముంబై బయలుదేరాల్సి ఉంది. విమానంలో ప్రయాణికులు కూడా రెడీగా ఉన్నారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

కానీ, అప్పుడే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన చాటింగ్ విమానం నిలిచిపోయేలా చేసింది. విమానంలో ఉన్న ఒక యువకుడు, తన గల్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తున్నాడు. గల్‌ఫ్రెండ్‌ కూడా అదే ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లడానికి విమానం కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా అక్కడి సెక్యూరిటీ గురించి చాట్ చేశారు. అందులో అమ్మాయి.. ‘యు ఆర్ ద బాంబర్’ అంటూ ఆ అబ్బాయికి ఒక మెసేజ్ పంపింది. ఈ మెసేజ్‌ను ఆ యువకుడి పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా చూశాడు. అంతే ఆ యువకుడు నిజంగానే బాంబర్ అయ్యుండొచ్చని కంగారుపడిపోయిన అతడు ఆ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పాడు. వెంటనే విమాన సిబ్బంది, భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

ముందు జాగ్రత్తగా విమానంలోని ప్రయాణికుల్ని దించేసి, లగేజీతోపాటు విమానం మొత్తం పూర్తిగా తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. మరోవైపు అతడి గల్‌ఫ్రెండ్‌ను కూడా విచారించారు. దీంతో ఆమె బెంగళూరు విమానం కూడా మిస్సైంది. చివరకు విమానంలో ఎలాంటి బాంబు లేదని, అతడు బాంబర్ కాదని గుర్తించారు. ఇద్దరి మధ్యా సరదాగా చాటింగ్ జరిగినట్లు తెలుసుకున్నారు. తనిఖీల తర్వాత, ఆరు గంటలు ఆలస్యంగా మంగళూరు-ముంబై విమానం బయలుదేరింది. మధ్యాహ్నం వెళ్లాల్సిన విమానం సాయంత్రం ఐదు గంటల తర్వాత బయలుదేరింది.