chennai airport: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తృటిలో త‌ప్పిన‌ పెను ప్రమాదం

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఏషియానా ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజన్‌లో లోపం త‌లెత్తింది.

chennai airport: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తృటిలో త‌ప్పిన‌ పెను ప్రమాదం
ad

chennai airport: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఏషియానా ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజన్‌లో లోపం త‌లెత్తింది. గ‌త‌ అర్ధరాత్రి దాటిన అనంత‌రం రన్ వే పై టెకాఫ్ కావాల్సిన సమయంలో ఆ విమాన‌ పైలట్ ఇంజన్‌లో లోపాన్ని గుర్తించారు. విమానాన్ని టేకాఫ్ చేయకుండా రన్ వేపైనే నిలిపివేసి, అధికారుల‌కు సమాచారం అందించారు.

Rajya Sabha Polls: స‌త్తా చాటిన‌ బీజేపీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

ఆ స‌మ‌యంలో విమానంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం టేకాఫ్ అయ్యి ఉంటే పెను ప్రమాదం జరిగేదని అధికారులు చెప్పారు. పైల‌ట్ ఇంజ‌న్‌లో లోపాన్ని గుర్తించ‌డంతో ఆ ప్ర‌మాదం త‌ప్పింద‌ని వివ‌రించారు. విమానంలోని ప్ర‌యాణికులు, సిబ్బంది అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని చెప్పారు.