Flipkart Big Billion Days.. అదిరిపోయే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించిన తేదీని ఇంకా రివిల్ చేయలేదు. కాగా, స్మార్ట్ ఫోన్లపై డీల్స్ వినియోగదారులను టెంప్ట్ చేస్తున్నాయ

Flipkart Big Billion Days.. అదిరిపోయే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

Flipkart Big Billion Days

Flipkart Big Billion Days : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించిన తేదీని ఇంకా రివిల్ చేయలేదు. కాగా, స్మార్ట్ ఫోన్లపై డీల్స్ వినియోగదారులను టెంప్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ యానువల్ సేల్ లో కొత్త ఫోన్లు లాంచ్ చేయనున్నారు. డిస్కౌంట్ లో పాపులర్ ఫోన్లు అందుబాటులో ఉంచనున్నారు. Pixel 4a, Poco X3 Pro, Moto Edge 20 Fusion, Asus ROG Phone 3, Infinix Hot 10s పై ఆఫర్లు ఇవ్వనున్నట్లు రివీల్ చేసింది.

Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు

కొన్ని రోజుల తర్వాత ఆఫర్లపై మరింత క్లారిటీ రానుంది. పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను ఇంకా తెలుపలేదు. సాధారణంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తారు. అంతేకాదు క్రెడిట్, డెబిట్ కార్డులపై డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. పలానా బ్యాంకు కార్డుపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుంది.

Poco X3 Pro
పోకో విడుదల చేసిన ఎక్స్ 3 దర రూ.18వేల 999. అయితే ఫ్లిప్ కార్ట్ లో దీని ధర కేవలం రూ.16వేల 999. అంటే 2వేల రూపాయలు డిస్కౌంట్. అదే సమయంలో బ్యాంకు డిస్కౌంట్లు అదనం.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

Moto Edge Fusion 20
ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీలో మోటో ఎడ్జ్ ఫ్యూజన్ 20 ధర రూ.19వేల 999 గా ఉంది. మోటో ఎడ్జ్ ఫ్యూజన్ 20 లాంచ్ ధర రూ.21వేల 499. ఫ్లిప్ కార్ట్ సేల్ లో దీనిపై ఇచ్చే డిస్కౌంట్ రూ.1500. బ్యాంకు డిస్కౌంట్లు అదనం.

Asus ROG Phone 3
ఫ్లిప్ కార్ట్ సేల్ లో Asus ROG Phone 3 ధర రూ.34వేల 999. దీని లాంచ్ ప్రైస్ రూ.49వేల 999. ఇండియాలో లాంచ్ తర్వాత కంపెనీ దీని ధర తగ్గించింది. బ్యాంకు ఆఫర్లు అదనం.

Infinix Hot 10s
ఫ్లిప్ కార్ట్ లో ఇన్ ఫిక్స్ హాట్ 10ఎస్ ధర రూ.9వేల 499. వాస్తవానికి దీని ధర రూ.12వేల 999.

Pixel 4a
ఫ్లిప్ కార్ట్ సేల్ లో పిక్సల్ 4ఏ ధర రూ.20వేల నుంచి 29వేల 999 వరకు ఉండనుంది. మార్కెట్ లో దీని ధర రూ.31వేల 999. పిక్సల్ 4ఏ గతంలోని ధర రూ.29వేల 999. ఈసారి ధర అంతకన్నా తక్కువగా ఉండొచ్చని అంచనా.