CM YS JAGAN: ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచన

వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఏపీ అసెంబ్లీకి సంబందింధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ సారి ఈ స్థానాలకు పోటీ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.

CM YS JAGAN: ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచన

Cm Ys Jagan

CM YS JAGAN: వచ్చే ఏడాదిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టిపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందుకు తగిన అభ్యర్థులను సూచించాలని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఏపీ అసెంబ్లీకి సంబందింధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ సారి ఈ స్థానాలకు పోటీ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇంతవరకు పార్టీ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ నిర్వహించలేదని, ఈ సారి పోటీ పెడదామని ఎమ్మెల్యేలకు సూచించారు.

Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో శివలింగానికి పూజలు.. 21న సుప్రీంకోర్టులో విచారణ

ఖాళీ అవ్వబోతున్న స్థానాలు భర్తీ చేసేందుకు సరైన అభ్యర్థుల్ని సూచించాలని కోరారు. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎన్నికైన విఠపు బాలసుబ్రహ్మణ్యం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ఎన్నికైన కత్తి నరసింహా రెడ్డి, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి వెన్నుపూస గోపాల రెడ్డి, యండపల్లి శ్రీనివాసులు, పీవీఎన్ మాధవ్ పదవీ కాలం ముగియనుంది. ఈ జిల్లాలకు చెందిన నేతలతో జగన్ చర్చించారు.