Lock Down: ఈ 5 సూత్రాలు పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!

రోనా లాక్ డౌన్ విధింపు.. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త సూచనలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఆంక్షల విషయంలో రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం అప్పటి నుండి పలు సూచనలు చేస్తూ వస్తుంది.

Lock Down: ఈ 5 సూత్రాలు పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!

Lock Down

Lock Down: కరోనా లాక్ డౌన్ విధింపు.. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త సూచనలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఆంక్షల విషయంలో రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం అప్పటి నుండి పలు సూచనలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని సూచనలు చేసింది.

వివిధ రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షల సడలింపు ఇస్తుండగా.. కొద్ది రాష్ట్రాలలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ తొలగించారు. ఈ క్రమంలోనే ఆంక్షల సడలింపును దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాష్ట్రాలకు పంచ సూత్రాలను సూచించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా వంటి ఐదు సూత్రాలను పాటిస్తూ ఆంక్షల సడలింపు ఇవ్వాలని సూచించింది.

మాస్క్, సోషల్ డిస్టెన్స్ యధావిధిగా పాటిస్తూనే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆంక్షల సడలింపులు అమలు చేయాలని సూచించింది. ఇక, పూర్తిస్థాయిలో ఆంక్షల సడలింపులు, లాక్ డౌన్ తొలగించిన రాష్ట్రాలలో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టాలని.. మిగతా రాష్ట్రాలలో కూడా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించింది.