Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి.. కేంద్రం కీలక సూచనలు

దేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందికి మంకీపాక్స్ సోకగా, ఓ వ్యక్తి మరణించాడు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి.. కేంద్రం కీలక సూచనలు

Monkeypox: దేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందికి మంకీపాక్స్ సోకగా, ఓ వ్యక్తి మరణించాడు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కేరళ రాష్ట్రంలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి వ్యాప్తి నివారణకు ఏం చేయాలి, బాధితులతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై పలు సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్ లో వివరాలను వెల్లడించింది.

Monkeypox : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు..భారత్ లో ఏడుకు చేరిన కేసులు

మంకీపాక్స్ వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్ లో ఉంచాలి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు బాధితులు ఐసోలేషన్ లో ఉండాలి. అదేవిధంగా బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలి. దద్దుర్లుకు బయటి గాలి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచేందుకు దుస్తులు ధరించాలి. బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్ లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ రాసుకోవాలి. బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడక గదిని కుటుంబంలో ఇతరులు వాడకూడదు. బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతక్కూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మంకీపాక్స్ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చని కేంద్రం తెలిపింది.