Heart Health:మహిళల గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు!

అరటిపండు పొటాషియం యొక్క ఉత్తమ మూలంగా పరిగణించబడుతున్నప్పటికీ, మరికొన్ని పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఉన్నాయి.  ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువ‌గా తీసుకోవాలి.

Heart Health:మహిళల గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు!

Potassium

Heart Health:పొటాషియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో రక్తపోటు అస్తవ్యస్తంగా మారుతుంది. ఇది మీ ఎముకలు మరియు కండరాలను ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే నాడీ వ్యవస్థ , గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన పొటాషియాన్ని రోజు వారిగా తీసుకునే ఆహారం ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా మహిళ గుండె ఆరోగ్యానికి పొటాషియం ఎంతగానో తోడ్పడుతుంది. మూత్రంలో ఎక్కువ సోడియం విసర్జనకు పొటాషియం శరీరానికి సహయపడుతుంది. ఆహారం ద్వారా అందే పొటాషియం మహిళల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన పెద్దవయస్సువారికి రోజువారి పొటాషియం విలువ 4,700 mgగా నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన, వైవిధ్యమైన ఆహారాన్నితీసుకోవటం ద్వారా దీనిని సులభంగా తినవచ్చు. అరటిపండు పొటాషియం యొక్క ఉత్తమ మూలంగా పరిగణించబడుతున్నప్పటికీ, మరికొన్ని పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఉన్నాయి.  ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువ‌గా తీసుకోవాలి. అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుసెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. అవకాడోస్: అవకాడోస్‌లో, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ K మరియు ఫోలేట్‌ల మెలాంజ్‌ని శరీరానికి లభిస్తాయి. అయితే మీడియం సైజులో ఉండే అవకాడోలో రోజుకు కావాల్సిన దాదాపు 15 శాతం పొటాషియం ఉంటుంది. అవకాడోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల కడుపునిండిన భావం కలిగి తొందరగా ఆకలివేయదు.

2.శనగలు; ఇది శాకాహారులకు బలమైన ఆహారం. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం ఇతర పదార్థాలతో కలిపి తినాలి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

3. చిలగడదుంపలు: ఈ దుంపను ఉడికించి తినాలి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

4. పుచ్చకాయ: ఈ ఎరుపు రంగు, రుచికరమైన పండులో అధిక నీటి శాతం ఉంటుంది. పుచ్చకాయను తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన పొటాషియంను పొందవచ్చు.

5.రాజ్మా ; రాజ్మాలో పొటాషియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోజువారి డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలను ఇస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

6. బచ్చలికూర: బచ్చలి అత్యంత పోషకాలు కలిగిన కూరగాయలలో ఒకటి.

7.అవిసె గింజలు – అవిసె గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినవచ్చు లేదా ఇతర ఆహారాలలో కలుపుకొని తినవచ్చు. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

8. కొబ్బరి నీరు: కొబ్బరి నీరు, ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ పానీయం, ఇది స్పోర్ట్స్ డ్రింక్స్‌కు అద్భుతమైన సహజ ప్రత్యామ్నాయం, ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.

9.చేపలు ; సాల్మన్ చేపల్లో కూడా పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.