Mother cow : చనిపోయిన దూడకోసం..తల్లడిల్లిన తల్లి ఆవు.. కిలోమీటర్ల మేర పరుగు

రాజమండ్రిలో పదిరోజుల క్రితం ఓ ఆవు దూడను బైక్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన దూడను స్ధానికులు కొంతమంది సమీపంలోని గోశాలకు తరలించి చికిత్స అందించారు.

Mother cow : చనిపోయిన దూడకోసం..తల్లడిల్లిన తల్లి ఆవు.. కిలోమీటర్ల మేర పరుగు

చనిపోయిన దూడకోసం..తల్లడిల్లిన తల్లి ఆవు

Mother cow : సృష్టిలో తల్లి ప్రేమను మించినది లేదు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవటమేకాదు. వారికి ఏచిన్న బాధ కలిగినా ఆతల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన తల్లి ప్రేమకు అద్దం పడుతుంది. మనుషులే కాదు నోరు లేని పశువులకు ప్రేమానురాగాలు ఉంటాయని మరో మారు రుజువు చేసింది. వివరాల్లోకి వెళితే

రాజమండ్రిలో పదిరోజుల క్రితం ఓ ఆవు దూడను బైక్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన దూడను స్ధానికులు కొంతమంది సమీపంలోని గోశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఆవు దూడ ప్రాణాలు విడిచింది. మృతి చెందిన ఆవుదూడకు శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని గోశాల నిర్వాహకులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఓ వ్యానును తీసుకువచ్చి అందులో ఆవుదూడ మృతదేహాన్ని ఉంచి డబ్బులతో ఊరింగింపుగా స్మశానవాటికకు బయలు దేరారు.

అదే క్రమంలో తల్లి ఆవు తన దూడ మృతదేహాన్ని తీసుకువెళుతున్న వ్యాను వెంటనే నడవసాగింది. అదే బాటలో మరికొన్ని ఆవులు కూడా వ్యాను వెంటే పరుగులు పెట్టాయి. తన బిడ్డకు ఏమైందన్న ఆందోళన ఆ తల్లి ఆవు మొఖంలో స్పష్టంగా కనిపిస్తుండటాన్ని చూసి స్ధానికులు చలించిపోయారు. కళ్ళవెంట కన్నీరు ఒలుకుతూ నోరులేని ఆమూగజీవి పడ్డ రోధన అంతాఇంతాకాదు.ఊరేగింపు పూర్తయి వాహనం వేగంగా స్మశానవాటిక వైపు  కదులుతున్నా పరుగు ఆపకుండా దాని వెంటనే స్మశానం వరకు వెళ్ళింది తల్లి ఆవు. స్మశానంలో గోశాల నిర్వాహకులు అంత్యక్రియలు నిర్వహించారు. తన బిడ్డకు కడసారి వీడ్కోలు పలికి అక్కడి నుండి వెనుదిరిగింది. ఈ దృశ్యాలను చూసిన వారంతా తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అని ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు.