Pomegranate : చర్మం, జుట్టు ఆరోగ్యానికి…దానిమ్మతో కలిగే ప్రయోజనాలు ఇవే!…

పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు , టానిన్లు పుష్కలంగా ఉన్నందున దానిమ్మ తినడం వల్ల ఊబకాయం నివారణకు సహాయపడుతుంది, కొవ్వను వేగంగా కరిగించేందుకు, జీవక్రియలను పెంచటానికి సహాయపడతాయి.

Pomegranate : చర్మం, జుట్టు ఆరోగ్యానికి…దానిమ్మతో కలిగే ప్రయోజనాలు ఇవే!…

Pomegranates

Pomegranate : ఆరోగ్యకరమైన పండ్లలో దానిమ్మ పండును ఒకటిగా చెప్పవచ్చు. వివిధ వ్యాధులను నివారించడంతో పాటు మంచి ఆరోగ్యానికి దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు దానిమ్మను విరివిగా ఉపయోగిస్తారు. దానిమ్మపండు పై భాగంలో తొక్కను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో, ఎర్రటి విత్తనాలు ఉంటాయి. ఇవి నీటితో నిండి ఉంటాయి. దానిమ్మ గింజలను డైరెక్టుగా లేదంటూ జ్యూస్ గా చేసుకోనైనా తీసుకోవచ్చు. ఒక దానిమ్మపండులో 600 కి పైగా విత్తనాలను ఉంటాయి. దానిమ్మ గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. దానిమ్మ గింజలను ఉపయోగించి దానిమ్మ నూనె తయారు చేస్తారు. దానిమ్మ నూనె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

దానిమ్మ పండులో కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ సి, థియామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. దానిమ్మ పండు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మ రోజువారి ఆహారంలో చేర్చుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులో ఉండే శక్తి వంతమైన టానిన్లు, ఆంథోసైనిన్స్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల నుండి రక్షించటంలో సహాయపడతాయి.

మనిషి మానసిక స్ధితిపై దానిమ్మ అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంగస్తంభన కణజాలలో రక్త ప్రవాహాన్ని పెంచటం ద్వారా అంగస్తంభన లక్షణాలను మెరుగుపరచటంలో దానిమ్మ దోహదపడుతున్నట్లు ఒక అధ్యయనంలో నిర్ధారణ అయింది. నపుంసకత్వాన్ని పోగొట్టటంతోపాటు, టెస్టోస్టెరాన్ స్ధాయిలను పెంచుతుంది. పురుషులలో సర్వసాధారణంగా వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి దానిమ్మ గింజలు బాగా పనిచేస్తాయి. దానిమ్మ గింజలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండటంతోపాటు, క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించి, క్యాన్సర్ కణాల మరణాన్ని కూడా ప్రేరేపించే ప్యూనిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు , టానిన్లు పుష్కలంగా ఉన్నందున దానిమ్మ తినడం వల్ల ఊబకాయం నివారణకు సహాయపడుతుంది, కొవ్వను వేగంగా కరిగించేందుకు, జీవక్రియలను పెంచటానికి సహాయపడతాయి. దానిమ్మపండు తినడం ,దానిమ్మ రసం ఒక గ్లాసు తాగడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మలలో విటమిన్ సి మరియు విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తటస్తం చేయడంలో సహాయపడతాయి. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ , చర్మపు మంటలను, మొటిమల నుండి కాపాడి చర్మం సామర్థ్యాన్ని పెంచుతాయి.

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు దానిమ్మ గింజలను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టును బలంగా మార్చే కొవ్వు ఆమ్లం ప్యూనిక్ ఆమ్లం దానిమ్మలో ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దానిమ్మ గింజలు మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. దానిమ్మలో ఉండే ఐరన్ కారణంగా హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరుగుతాయి. రక్తహీనత నుండి కాపాడతాయి. కడుపు సంబంధిత సమస్యలైన విరేచనాలు, అతిసారం, కలరా వంటి సమస్యలను తగ్గించటానికి దానిమ్మ దోహదం చేస్తుంది. దానిమ్మలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్యూనిక్ యాసిడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. భోజనం తరువాత దానిమ్మ గింజలు, లేదంటే జ్యూస్ తాగటం మంచిది.

దానిమ్మ గింజలలో పుష్కలంగా లభించే పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే మెదడు యొక్క నాడీ కణాల మధ్య పేరుకుపోయే అమిలోయిడ్ ఫలకం స్థాయిలను తగ్గిస్తుంది. దానిమ్మ నోటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రభావవంతంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో దానిమ్మపండు పనితీరు బాగందని అనేక అధ్యయనాల్లో తేలింది.