Gujarat Poll 2022 : 27 ఏళ్లలో తొలిసారి త్రిముఖపోరు .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా?

27 ఏళ్లలో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో త్రిముఖపోరు జరుగనుంది. గుజరాత్ ను ఏలుతున్న బీజేపీ ఈసారికూడా విజయం సాధిస్తుందా? అధికారాన్ని దక్కించుకుంటుందా? లేదా పంజాబ్ లో అనూహ్యంగా విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఆప్ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో తన సత్తా చూపుతుందా? .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా? పాదయాత్రతో కొత్త జోష్ తీసుకొచ్చిన రాహుల్ గాంధీ జోడో యాత్ర జోష్ గుజరాత్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ ఎన్నికలవైపే దేశం అంతా దృష్టి సారిస్తోంది.

Gujarat Poll 2022 : 27 ఏళ్లలో తొలిసారి త్రిముఖపోరు .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా?

Gujarat Poll 2022

Gujarat Poll 2022 : భారతదేశానికి రాజధాని ఢిల్లీ అయితే.. ఈ దేశంలో బీజేపీ చేసే రాజకీయాలకు రాజధాని గుజరాత్. గుజరాత్ మోడల్‌ని చూపించే.. భారత్‌లో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆ మోడల్ స్టేట్‌లో ఎలక్షన్స్ జరగబోతున్నాయ్. రెండున్నర దశాబ్దాలకు పైగా గుజరాత్‌ను ఏలుతున్న బీజేపీ.. ఆ రికార్డును అలాగే నిలబెట్టుకుంటుందా? చాలా ఏళ్ల తర్వాత అక్కడ కనిపిస్తున్న త్రిముఖ పోరు.. ఎలాంటి సీన్ చూపించబోతోంది? ఓవరాల్‌గా.. గుజరాత్ పోల్స్‌ని పూర్తిగా మార్చేసే కీ ఫ్యాక్టర్స్ ఏంటి? 27 ఏళ్లలో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో త్రిముఖపోరు జరుగనుంది. గుజరాత్ ను ఏలుతున్న బీజేపీ ఈసారికూడా విజయం సాధిస్తుందా? అధికారాన్ని దక్కించుకుంటుందా? లేదా పంజాబ్ లో అనూహ్యంగా విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఆప్ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో తన సత్తా చూపుతుందా? .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా? పాదయాత్రతో కొత్త జోష్ తీసుకొచ్చిన రాహుల్ గాంధీ జోడో యాత్ర జోష్ గుజరాత్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ ఎన్నికలవైపే దేశం అంతా దృష్టి సారిస్తోంది.

ఈ డిసెంబర్ తొలివారంలోనే.. దేశంలో బిగ్గెస్ట్ పొలిటికల్ డెవలప్‌మెంట్ కనిపించబోతోంది. వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ ఎలక్షన్స్ మీదే…ఇప్పుడు ఇండియా అటెన్షన్ అంతా ఉంది. 4 కోట్ల 90 లక్షల మంది గుజరాత్ ఓటర్లు.. 27 ఏళ్లుగా నరేంద్ర మోదీ, బీజేపీతో ఉన్న తమ బంధాన్ని ఉంచుకుంటారా? తెంచుకుంటారా? అన్నది.. డిసెంబర్ 8నే డిసైడ్ కానుంది. 27 ఏళ్లుగా మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా.. వరుసగా గెలుస్తూ.. గుజరాత్‌ను ఏలుతూ వస్తోంది బీజేపీ. 1995 నుంచి 2017 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో కమలదళమే.. కాషాయ జెండాను ఎగరేస్తూ వచ్చింది. ఈ డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో.. వరుసగా ఏడోసారి కూడా గుజరాత్‌ను బీజేపీయే కైవసం చేసుకుంటుందా? అక్కడి ప్రజలు మరో పార్టీకి చాన్స్ ఇచ్చి చూస్తారా? అనే ఆసక్తి భారత్ అంతటా కనిపిస్తోంది.

గడిచిన రెండున్నర దశాబ్దాల గుజరాత్ రాజకీయాల్లో, అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో.. అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ చాలెంజర్‌గా కనిపిస్తోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 41 శాతం ఓట్లతో 77 సీట్లను గెలిచింది. అదొక్కటే కాదు.. 30 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ 40 శాతం ఓట్ షేరింగ్ నిలబెట్టుకుంటూ వస్తోంది. మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉచితాలు, కొత్త పథకాలతో అరవింద్ కేజ్రీవాల్.. గుజరాత్ పొలిటికల్ స్క్రీన్‌పై కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. 1995 నుంచి 2017 వరకు.. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ కనిపించింది. కానీ.. తాజాగా మారిన రాజకీయ పరిస్థితులతో.. 27 ఏళ్లలో తొలిసారి గుజరాత్‌లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. దీంతో.. ఈసారి అక్కడ పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతోందో చూడాలని ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది.

2017 ఎన్నికల్లో.. కుల ఆందోళనలు, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్థిక పరిణామాలు.. బీజేపీని కొంతమేర ఇబ్బంది పెట్టాయి. కానీ.. ఇప్పుడా టెన్షన్ లేదు. ఓబీసీ కోటా కోసం పటీదార్ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ బీజేపీలోనే ఉన్నాడు. గత ఎన్నికల్లో.. బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన అల్పేష్ ఠాకూర్ కూడా కమలదళంలో చేరిపోయాడు. ఇక.. దళిత యువనేత జిగ్నేశ్ మేవాని సింగిల్ రేంజర్‌గా మిగిలిపోయారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ఇప్పుడు సమస్య కాదు. కోవిడ్‌ మహమ్మారితో పాటు ఆర్థిక సమస్యల నుంచి గుజరాత్ ఎప్పుడో బయటపడింది. ఇటీవలే జరిగిన యూపీ, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. గ్రాండ్ విక్టరీ కొట్టడం బీజేపీ కాన్ఫిడెన్స్‌ని మరింత పెంచింది.

గత ఎన్నికల్లో గుజరాత్ ఓటర్లు కాషాయ పార్టీకే అధికారం అప్పగించినప్పటికీ.. మెజారిటీ తగ్గించి.. కేవలం 99 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. గత ఐదు ఎన్నికలతో పోలిస్తే.. 115 కంటే తక్కువ సీట్లు గెలవడం 2017లోనే తొలిసారి. తర్వాత.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో.. బీజేపీ కౌంట్ 111కి చేరింది. అయితే.. ఈసారి 2017కి భిన్నంగా గుజరాత్‌లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్‌లో గ్రౌండ్‌లో గ్రాండ్ విక్టరీ తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా గెలుపు జెండా ఎగరేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు.. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న బీజేపీ.. ఆ రికార్డును అలాగే నిలుపుకోవాలని చూస్తోంది.

గుజరాత్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. నరేంద్రమోదీ, ఆ తర్వాత బీజేపీ. అలాంటి స్టేట్‌లో.. ఎలక్షన్ అంటే.. ఇండియా అటెన్షన్ మొత్తం.. అటువైపే ఉంటుంది. ఎందుకంటే.. ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే.. ఈ దేశంలో బీజేపీ చేసే రాజకీయాలకు గుజరాతే క్యాపిటల్‌. పైగా.. దేశంలోనూ అధికారంలోకి రావడానికి.. గుజరాత్ స్టేట్ మోడల్‌నే చూపించారు. 2014 లోక్‌సభ ఎన్నికలు మొత్తం.. గుజరాత్ మోడల్ సెంట్రిక్‌గానే నడిచాయి. అప్పట్లో.. బీజేపీకి.. అదొక సూపర్ సక్సెస్ ఫార్ములా అని చెప్పొచ్చు. అలాంటి స్టేట్‌లో.. 27 ఏళ్లుగా పవర్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఈసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకొని.. ఉన్న రికార్డును నిలబెట్టుకోవడంతో పాటు సరికొత్త చరిత్రను సృష్టించాలని చూస్తోంది.

గుజరాత్‌లో ఎన్నికలు వస్తున్నాయంటే.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఎలక్షన్ ఫైట్ కనిపించేది. అధికారం నిలబెట్టుకునేందుకు కమలదళం.. అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్.. అన్ని విధాలుగా ప్రయత్నించేవి. కానీ.. 27 ఏళ్లుగా ఓట్లు పడుతున్నా.. సీట్లు గెలుస్తున్నా.. కాంగ్రెస్ మాత్రం పవర్‌లోకి రావడం లేదు. హస్తం పార్టీకి.. సెపరేట్‌గా 40 శాతం ఓట్ బ్యాంక్ ఉన్నా.. అది అధికారం దాకా తీసుకెళ్లడం లేదు. ఇప్పుడున్న దానికి మరో 7 నుంచి 10 శాతం ఓట్లు రాబట్టగలిగితే.. కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ.. అలా జరగడం లేదు. ఫలితంగా.. గుజరాత్‌పై బీజేపీ జెండానే ఎగురుతూ వస్తోంది. ఇప్పుడు.. ఈ రెండు పార్టీల మధ్యలోకి.. కొత్తగా మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. అదే.. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈసారి.. ఈ 3 పార్టీల మధ్యే పోల్ వార్ గట్టిగా జరగనుందన్న సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యలో.. ఆప్ ఎంత మేరకు స్కోర్ చేయగలుగుతుందన్నది ఆసక్తిగా మారింది. పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకున్నట్లే.. అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లోనూ ఇండియా మొత్తం షేక్ అయ్యే సీన్ చూపిస్తారా? అనే ఆసక్తి రేగుతోంది. ఈసారి గుజరాత్ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యం కనబరుస్తుందన్న దానిపై.. రాజకీయ వర్గాల్లోనూ, దేశ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.