Elephant : గుంతలో పడిపోయిన ఏనుగు పిల్ల..నాలుగు గంటలుపాటు కష్టపడి కాపాడిన ఫారెస్ట్ సిబ్బంది

అడవిలో దారి తప్పి గోతిలో పడిపోయిన ఏనుగు పిల్ల తన తల్లి కోసం అరుపులు పెడుతోంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు.

Elephant : గుంతలో పడిపోయిన ఏనుగు పిల్ల..నాలుగు గంటలుపాటు కష్టపడి కాపాడిన ఫారెస్ట్ సిబ్బంది

Elephant Rescue

Elephant :  అడవిలో దారి తప్పి గోతిలో పడిపోయిన ఏనుగు పిల్ల తన తల్లి కోసం అరుపులు పెడుతోంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు కష్టపడి ఆ ఏనుగు పిల్లను పైకి తీసి దాని కుటుంబంలో కలిపారు.

ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏనుగు పిల్లను పైకి లాగేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించినా వాళ్ల వల్ల కాలేదు. ఒక ఎక్స్‌క‌వేట‌ర్‌తో పెద్ద‌ గుంత త‌వ్వారు. అనంత‌రం ఒక అధికారి చీక‌టి గొయ్యిలోకి దిగి, అప్ప‌టికే అల‌సిపోయి ప‌డుకున్న ఏనుగుకు తాడును బిగించాడు. మిగ‌తా అధికారులు దాన్ని పైకి లాగారు.

చివరగా, పిల్ల ఏనుగును దాని కుటుంబంతో క‌లిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండగా…అర్ధ‌రాత్రిపూట ఏనుగుపిల్ల‌ను కాపాడేందుకు వెళ్లిన అధికారుల అంకిత‌భావాన్ని నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు.