Forgot ATM Card : ఏటీఎంలో డబ్బులు తీయాలంటే.. ఇకపై డెబిట్ కార్డు అక్కర్లేదు.. మీ ఫోన్ ద్వారా ఈజీగా ఇలా విత్‌డ్రా చేసుకోవచ్చు!

Forgot ATM Card : సాధారణంగా ఏటీఎంలో నగదు తీసుకోవాలంటే.. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ తప్పనిసరిగా అవసరం.. అయితే మీరు ఏటీఎం కార్డు తీసుకెళ్లడం మర్చిపోయారా? ఏటీఎంలో నుంచి డబ్బులు ఎలా తీయడం అని ఆలోచిస్తున్నారా?

Forgot ATM Card : ఏటీఎంలో డబ్బులు తీయాలంటే.. ఇకపై డెబిట్ కార్డు అక్కర్లేదు.. మీ ఫోన్ ద్వారా ఈజీగా ఇలా విత్‌డ్రా చేసుకోవచ్చు!

Forgot ATM card You can withdraw cash using your phone at the ATM

Forgot ATM Card : సాధారణంగా ఏటీఎంలో నగదు తీసుకోవాలంటే.. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ తప్పనిసరిగా అవసరం.. అయితే మీరు ఏటీఎం కార్డు తీసుకెళ్లడం మర్చిపోయారా? ఏటీఎంలో నుంచి డబ్బులు ఎలా తీయడం అని ఆలోచిస్తున్నారా? మీకు UPI అకౌంట్ ఉందా? అయితే ఆందోళన అక్కర్లేదు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇప్పటికే కార్డ్ లేకుండా లావాదేవీలు చేసేందుకు అనుమతి ఇస్తోంది. UPI పేమెంట్స్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPIC) UPIని ఆపరేట్ చేస్తోంది. అందుకే వినియోగదారులు UPI ద్వారా ATMల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ICCW) అనే ఫీచర్ ద్వారా కార్డ్‌లను తీసుకెళ్లకపోయినా ఏటీఎంలో నుంచి నగదు తీసుకోవచ్చు. క్లోనింగ్, స్కిమ్మింగ్, డివైజ్ ట్యాంపరింగ్‌తో సహా కార్డ్ మోసాలను నివారించేందుకు ATMల కోసం ICCW ఆప్షన్ అందించాలని ఆర్బీఐ (RBI) బ్యాంకులను కోరింది.

Forgot ATM card You can withdraw cash using your phone at the ATM

Forgot ATM card You can withdraw cash using your phone at the ATM

కార్డ్‌లెస్ నగదు సదుపాయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్, మరిన్నింటి ATMలలో ఇప్పటికే అందుబాటులో ఉంది. GooglePay, PhonePe, Paytm, ఇతర UPI యాప్‌ల వంటి యాప్‌లను అందించే ఏదైనా UPI పేమెంట్ సర్వీసులను ఉపయోగించి UPI నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని పొందవచ్చు. UPI ద్వారా ATM నుంచి నగదును ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ATMల నుంచి UPIని ఉపయోగించి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..

– ఏదైనా ATM మెషీన్‌ దగ్గరకు వెళ్లండి.
– స్క్రీన్‌పై ‘Withdraw Cash’ ఆప్షన్ ఎంచుకోండి.
– ఆ తర్వాత, UPI ఆప్షన్ ఎంచుకోండి.
– మీ ATM స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది.
– ఇప్పుడు మీ ఫోన్‌లో UPI యాప్‌ని ఓపెన్ చేయండి.
– ATM మెషీన్‌లో కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయండి.
– మీరు విత్‌డ్రా చేయాలనుకునే నగదును నమోదు చేయండి.
– మీరు రూ. 5వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
– UPI పిన్‌ని నమోదు చేసి, ‘Hit Proceed’ బటన్‌ను Tap చేయండి.
– మీరు ATM మెషీన్ నుంచి మీ నగదును పొందవచ్చు.

Forgot ATM card You can withdraw cash using your phone at the ATM

Forgot ATM card You can withdraw cash using your phone at the ATM

ముఖ్యంగా, UPIని ఉపయోగించి ATMలలో కార్డ్‌లెస్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు ఎటువంటి అదనపు రుసుమును వసూలు చేయవని గుర్తించాలి. RBI ప్రకారం.. The on-us/off-us ICCW లావాదేవీలు నిర్దేశించిన (ఇంటర్‌చేంజ్ ఫీజు, కస్టమర్ ఛార్జీలపై) కాకుండా ఇతర ఛార్జీలు విధించకుండా చేయవచ్చు.

UPIని ఉపయోగించి వేరే బ్యాంక్ నుంచి ATMని ఉపయోగించడం కోసం ఛార్జీలు ప్రస్తుత కార్డ్ విత్‌డ్రా ఛార్జీల వలెనే ఉంటాయి. కస్టమర్‌లు వారి సంబంధిత బ్యాంకుల ATMలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలను పొందవచ్చు. ఇతర బ్యాంకుల ATMలలో మూడు ఉచిత విత్‌డ్రాలను పొందవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 21 వరకు పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Credit Card UPI : క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఉచితంగా యూపీఐ పేమెంట్లు, కండీషన్స్ అప్లయ్