సగం కారు..సగం ఎద్దుల బండి: భలే ఉందీ రైతన్న ఐడియా

సగం కారు..సగం ఎద్దుల బండి: భలే ఉందీ రైతన్న ఐడియా

former different idea.. Half car..half ox cart : రైతుకు ఎడ్ల బండి ఎంత ముఖ్యమో..ఆ ఎడ్లతోను బండితోను అంత అనుబంధం ఉంటుంది. ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతన్న ఒకేసారి ఎడ్లబండిని కారుని కూడా ఎక్కేశాడు. ఒకేసారి అని ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ ఫోటోను..ఈ వీడియోను చూస్తే అర్థం అయిపోతుంది.

ఇది చూసినవెంటనే కచ్చితంగా ఆ రైతు వినూత్న ఐడియాకు నోరెళ్లబెట్టాల్సిందే. ‘‘హేయ్..హేయ్..అంటూ ఎద్దులను అదిలిస్తూ కారులో దర్జాగా వెళుతున్నాడీ రైతు. ఎడ్లను అదిలిస్తూ కారుమీద వెళ్లటమేంటీ? మరీ చోద్యం కాకపోతే..కారులో వెళితూ ఎడ్లను అదిలించినట్లుగా అనటమేంటీ? అనుకోవచ్చు. అదేమని ఈ రైతు తెలివి.

ఆయనగారీ వింత బండి రోడ్డుమీద వెళుతుంటే అందరూ ఔరా..ఏమిటిది అంటూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ రైతు ఎవరో గానీ.. కారుకు ఎద్దుల బండిని కట్టాడు. కారు వెనుక భాగాన్ని ఎద్దులకు కట్టి దర్జాడా ఎద్దుల కారులో వెళుతూ అందరినీ ఆకట్టుకంటున్నాడు.

రెండు ఎద్దులు.. వెనుక సగం కారును అమర్చి ఈ బండిని తయారు చేశాడీ రైతు. సంగం ఎద్దుల బండి.. సగం కారులాగా ఉన్న ఈ బండిని రోడ్లపై నడుపుతూ రైతు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ బండిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

భలే భలే ఐడియా అంటూ అభినందిస్తున్నారు. ఇంత తెలివిగల రైతులు భారతదేశానికి సొంతం అని తెగ పొగిడేస్తున్నారు. ఈ వినూత్నమైన బండిని వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కారెడ్ల బండి వీడియో వైరల్ గా మారింది.