Amit Khare : ప్రధాని మోదీ సలహాదారుగా అమిత్ ఖరే

ప్రధాని మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే‌ను నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.

Amit Khare : ప్రధాని మోదీ సలహాదారుగా అమిత్ ఖరే

Modi Adviser

Amit Khare to PM Modi advisor : ప్రధాని మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే‌ను నియమితులయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో రెండేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై ఈ పదవిని నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన నియామకానికి కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 1985 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు ఐఏఎస్ అధికారి అయిన అమిత్ సెప్టెంబరు 30న పదవీ విరమణ చేశారు.

కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. ప్రధాని నిర్దేశకత్వంలో రూపొందిన నూతన విద్యా వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించారు. జాతీయ విద్యా విధానం 2020 రూపకర్తల్లో అమిత్ ఖరే క్రియాశీలక పాత్ర పోషించారు. డిజిటల్ మీడియా నిబంధనల విషయంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో కీలక మార్పులు తేవడంలో ఆయన విశేషంగా కృషి చేశారు.

Domestic Flights : దేశీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత.. పూర్తిస్థాయి సీటింగ్ కు అనుమతి

మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా, మాజీ కార్యదర్శి అమర్‌జీత్ సిన్హా ప్రధాన మంత్రి కార్యాలయంలో సలహాదారుల పదవుల నుంచి ఈ ఏడాది వైదొలగడంతో అమిత్ ఖరే నియామకం జరిగింది. ఆయన అత్యంత పారదర్శకతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ, సమర్థులుగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఉన్నత విద్య, పాఠశాలల శాఖకు నేతృత్వం వహించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా ఆయన నాయకత్వం వహించారు.