నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్!

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కెలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు రాగా.. అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ ఘటనతో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఈ విషయమై ఉద్రిక్తత సాగుతోంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ మొదలవగా.. నిమ్మాడ నుంచి వైసీపీ తరఫున కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి బరిలోదిగాడు. అప్పన్న.. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు. అప్పన్నను నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయగా.. ఈ విషయంపై రాజకీయంగా విమర్శలు తలెత్తుతున్నాయి. టీడీపీ నేతలు అక్రమ అరెస్ట్ అంటూ ఆందోళన చేస్తున్నారు. అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌‌కు తరలించగా.. 22 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.