Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు

తాజ్ మహల్ ఆవరణలోని షహీ మసీదు వద్ద నమాజ్ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 153 ప్రకారం.. అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం" అనే నేరం కింద కేసు నమోదు చేశారు.

Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు

Taj Mosque: తాజ్ మహల్ ఆవరణలోని షహీ మసీదు వద్ద నమాజ్ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 153 ప్రకారం.. అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం” అనే నేరం కింద కేసు నమోదు చేశారు.

“తాజ్ మహల్ ఆవరణలోని మసీదులో బుధవారం నమాజ్ చేసినందుకు నలుగురు పర్యాటకులను అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారు కాగా, అజంగఢ్‌కు చెందినవారు. వారిపై ఐపిసి సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాం” అని వికాస్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ అన్నారు.

శుక్రవారం మినహా అన్ని రోజుల్లో తాజ్ ప్రాంగణంలో నమాజ్‌ను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, ASI, ఆగ్రా సర్కిల్ రాజ్ కుమార్ పటేల్ తెలిపారు.

Read Also: తాజ్ మహల్ గదులు తెరవాలన్న పిటిషనర్.. హైకోర్టు ఆగ్రహం

సమాధి ఉన్న తాజ్‌గంజ్ ప్రాంతంలోని నివాసితులకు మాత్రమే శుక్రవారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఉందని చెప్పారు.

బుధవారం సాయంత్రం 5 గంటలకు షాహీ మసీదులో నమాజ్ చేస్తున్న నలుగురు వ్యక్తులు కనిపించారు. వారిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సీఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

“తాజ్ మహల్ మసీదులో క్రమం తప్పకుండా నమాజ్ చేస్తారు. కొన్ని రోజుల క్రితం భారత పురావస్తు శాఖ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం మినహా మసీదు ప్రాంగణంలో నమాజ్ చేయడం నిషేధించబడింది” అని తాజ్ మహల్ వద్ద ఇంతేజామియా కమిటీ అధిపతి అయిన ఇబ్రహీం జైదీ చెప్పారు.