Andhra Pradesh: కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు.. రాజ్‌భవన్‌కు చేరిన ఫైల్!

ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా నేడో.. రేపో గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మండలి సభ్యులలో ఈ శుక్రవారంతో నలుగురికి పదవీ కాలం ముగుస్తుంది.

Andhra Pradesh: కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు.. రాజ్‌భవన్‌కు చేరిన ఫైల్!

Andhra Pradesh Assembly

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా నేడో.. రేపో గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మండలి సభ్యులలో ఈ శుక్రవారంతో నలుగురికి పదవీ కాలం ముగుస్తుంది. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమంతకమణికి నేటితో (జూన్ 11) పదవీ కాలం ముగియనుంది.

దీంతో మరో నలుగురికి కొత్తగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది. గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఈ సభ్యులకు సాధారణంగా అధికార పార్టీకి చెందిన వారికే అవకాశం ఉండగా ఇప్పటికే వైసీపీ అధిష్టానం సభ్యులను ఎంపిక చేసి లిస్ట్ రాజ్ భవన్ కు పంపినట్లు తెలుస్తుంది. ఇందులో మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి పేర్లు ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది.

ఇందులో మోషేన్ రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన నేత కాగా, తోట త్రిమూర్తులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత.. టీడీపీ నుండి వైసీపీలో చేరిన కాపు వర్గానికి చెందిన నేత కాగా రాయలసీమ నుండి బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పేర్లను సామజిక వర్గాల సమతుల్యతతో ఎంపిక చేసినట్లుగా కనిపిస్తుంది.