Fuel Price: ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గించేదేలే.. నాలుగు కారణాలు ఇవే!

పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుంది.

Fuel Price: ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గించేదేలే.. నాలుగు కారణాలు ఇవే!

Fuel

Four Real Reasons: పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే, ఆ ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉపశమనం అందించలేకపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తుంది. భారతదేశంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.100 పెరిగిపోగా.. డీజెల్ కూడా దాదాపుగా లీటర్ రూ. 100కు దగ్గరగా అవుతుంది.

గ్లోబల్‌గా ముడి చమురు ధరలు తగ్గుతున్నా కూడా దేశంలో అన్నీ రాష్ట్రాల్లో ధరలు తగ్గట్లేదు. అయితే అందుకు కారణం ఎక్సైజ్ సుంకమే., అయితే, ఆ సుంకమే తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. పెట్రోల్, డీజిల్ సెగ సామాన్యులనూ తాకుతోంది. పెట్రోల్, డీజెల్ పెరగడం వల్ల నిత్యావసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్‌పై ట్యాక్స్‌ను తమిళనాడు ప్రభుత్వం రూ.3 తగ్గించగా.. కేంద్రం మాత్రం తగ్గిదే లే అంటుంది.

అందుకు నాలుగు కారణాలు ఏంటంటే? మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం అధిగమించడం ఓ కారణమైతే, సామాజిక సంక్షేమ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు అందించడం మరో కారణం.. లక్షల కోట్లకు పైగా భారీ నిధులు అవసరమయ్యే ముఖ్యమైన పథకాలు కోసం ప్రభుత్వం నిధులు అవసరం.. ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోవడానికి మరో కారణంగా చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా గత ఏడేళ్లకు ముందు అధికారంలో ఉన్న యూపీఏ స‌ర్కారు విధానాలే కారణమని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. రిటైల్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను కృత్రిమంగా త‌గ్గించేందుకు కేంద్ర చ‌మురు సంస్థ‌ల‌కు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్ర‌భుత్వం బాండ్ల‌ను జారీ చేసింద‌ని ఆరోపించిన ఆమె స‌ద‌రు ఆయిల్ బాండ్ల‌పై ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం వ‌డ్డీ చెల్లిస్తుంద‌ని నిర్మలా సీతారామన్ చెప్పారు.