Guntur : దొంగస్వాములు దోచేస్తున్నారు..విద్యావంతులే టార్గెట్, ఎలా మోసం చేస్తారో తెలుసా ?

ఒంగోలులో దొంగస్వాములు దోచేస్తున్నారు. విద్యావంతులే టార్గెట్ చేస్తూ..వారిని నిలువునా ముంచేస్తున్నారు. భవిష్యత్ లో పైకి రావాలంటే..ఏవో పూజలు చేయాలని..తాయెత్తులు కట్టుకోవాలని..లేకపోతే కీడు తప్పదంటూ వారు చేస్తున్న హెచ్చరికలతో విద్యావంతులు భయపడిపోతున్నారు.

Guntur : దొంగస్వాములు దోచేస్తున్నారు..విద్యావంతులే టార్గెట్, ఎలా మోసం చేస్తారో తెలుసా ?

Fake

Fraud Name Astrology : ఒంగోలులో దొంగస్వాములు దోచేస్తున్నారు. విద్యావంతులే టార్గెట్ చేస్తూ..వారిని నిలువునా ముంచేస్తున్నారు. భవిష్యత్ లో పైకి రావాలంటే..ఏవో పూజలు చేయాలని..తాయెత్తులు కట్టుకోవాలని..లేకపోతే కీడు తప్పదంటూ వారు చేస్తున్న హెచ్చరికలతో విద్యావంతులు భయపడిపోతున్నారు. వారు అడిగిన డబ్బును ముట్టచెబుతూ మోసపోతున్నారు. మూఢనమ్మకాలే పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్నారు.

Read More : Tokyo Olympics : బిగ్ బ్రేకింగ్, సెమీస్‌‌కు చేరుకున్న బాక్సర్ లవ్లీనా..భారత్‌‌కు మరో పతకం ఖాయం

మూఢనమ్మకాలు : –
కష్టాలు తీరుస్తామని నమ్మబలికి నట్టేటా ముంచేస్తున్నారు. ఇదంతా ఒంగోలు పట్టణంలో జరుగుతోంది. ప్రస్తుతం సమాజం అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో విశేష ప్రగతి సాధిస్తున్నారు. అయినా..మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా మూఢనమ్మకాల వైపు మొగ్గు చూపుతుండడం గుంటూరు జిల్లాలో కలవరపెడుతోంది.

Read More : Child Aadhaar : ఈ పని చేయకుంటే మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు.. చెక్ చేశారా?

తెల్లకాగితం ఇస్తాడు : –
పొన్నూరుకు అతిదగ్గరగా ఉండే ఓ గ్రామంలో ఓ దుకాణం తెరిచాడు. మంచి చెడులు చెబుతానంటూ…ప్రచారం చేశాడు. ఇతను చేసే మోసం…అంతా ఇంతా కాదు..ఇతని వద్దకు వచ్చిన వారికి ముందుగా..ఎదురుగా ఉన్న దుకాణం వద్దకు వెళ్లి తెల్లకాగితం తీసుకరావాలని చెబుతాడు. తెల్లకాగితంతో పాటు కొబ్బరికాయకు రూ. 200 వసూలు చేస్తారు. అనంతరం తెల్లకాగితాన్ని ఓ పద్ధతి ప్రకారం మడుస్తాడు. అనంతరం అమ్మవారి వద్ద ఈ తెల్లకాగితం పెట్టి దండం పెట్టుకోవాలంటాడు. హుండీలో రూ. 5 వేలు ఇవ్వాలని అమ్మవారు అంటోందని..నోటికొచ్చిన అంకెలు చెబుతాడు.

Read More : తెలంగాణకు పెట్టుబడుల వరద

తెల్లకాగితంపై గీతలు, బొమ్మలు : –
డబ్బులు వేసిన అనంతరం ఆ తెల్లకాగితాన్ని నీటిలో ముంచి తీస్తాడు. అనంతరం దానిపై గీతలు, బొమ్మలు కనిపిస్తాయి. వచ్చిన వ్యక్తి పరేషాన్ అవుతాడు. ఇలా ఎలా జరిగిందని అని ఆలోచిస్తాడు. ఎవరో చేతబడి చేశారని..భయపెడుతాడు. దీనిని విరగడ చేయాలంటే…కొన్ని పూజలు చేయాల్సి వస్తుందని..ఇందుకు డబ్బు ఖర్చవుతుందని చెబుతాడు. లక్షల రూపాయల్లో వసూలు చేస్తాడు. అసలు ఆ తెల్లకాగితంపై ముందుగానే…పటికతో పిచ్చి గీతలు, బొమ్మలు వేసి ఉంచుతాడు. అనంతరం రసాయనంలో ముంచడంతో దానిపై గీతలు, బొమ్మలు కనిపిస్తాయి. ఈ విషయం అక్కడకు వచ్చిన వారి తెలియకపోవడంతో మోసపోతున్నారు.

Read More : చదువుకు సాయం – జగనన్న విద్యాదీవెన

గుంటూరు వెస్ట్ డీఎస్పీ : –
గుంటూరులో జరుగుతున్న ఈ మోసాలపై గుంటూరు వెస్ట్ డీఎస్పీ కె.సుప్రజ స్పందించారు. ప్రజలు నమ్మించి దోచుకొనే దొంగస్వాములు, జ్యోతిష్యుల భరతం పడుతామని, ఇలాంటి వారి గురించి తెలిసినా…వారి వల్ల బాధితులైనా ధైర్యంగా..పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.