Corona Vaccine: రేపట్నుంచి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్!

ఇప్పటి వరకు మన దేశంలో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తుండగా 18 సంవత్సరాలు నిండిన వారికి నగదు చెల్లింపుతో వ్యాక్సిన్ అందిస్తుంది. కాగా.. రేపటి నుండి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికి ఫ్రీ వ్యాక్సిన్ అందించనున్నారు.

Corona Vaccine:  రేపట్నుంచి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్!

Corona Vaccine

Corona Vaccine: ఇప్పటి వరకు మన దేశంలో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తుండగా 18 సంవత్సరాలు నిండిన వారికి నగదు చెల్లింపుతో వ్యాక్సిన్ అందిస్తుంది. కాగా.. రేపటి నుండి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికి ఫ్రీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ ప్రకారం జూన్ 21 నుండి అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ అందించనున్నారు.

ఇందుకోసం 75 శాతం వ్యాక్సిన్ల‌ను త‌యారీదారుల నుంచి కొని అంద‌రికీ ఫ్రీగా ఇవ్వనుంది. తాజా వ్యాక్సిన్ విధానం ప్ర‌కారం 75 శాతం వ్యాక్సిన్ల‌ను కేంద్ర‌మే కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌నుండ‌గా.. మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లు మాత్రం త‌యారీదారులు ప్రైవేటు వారికి అమ్ముకునే అవ‌కాశం క‌ల్పించారు. నిజానికి ఇంతకుముందున్న వ్యాక్సిన్ పాలసీ ప్రకారం కేంద్రంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వారు వ్యాక్సిన్‌కు డ‌బ్బు చెల్లించాల్సిందేన‌ని అప్పుడు కేంద్రం ప్రకటించింది.

దీంతో తెలుగు రాష్ట్రాలు సహా కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆ ఖ‌ర్చు తాము భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. దీంతో ఈ వ్యాక్సిన్ విధానంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో కేంద్రం దిగి వ‌చ్చి ఇప్పుడు అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే.. ఇందుకోసం యధావిధిగా కోవిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.