Modi: ఆర్మీ నుంచి మైన్స్ వ‌ర‌కు మ‌హిళ‌ల‌ను దృష్టిలో పెట్టుకునే పాల‌సీలు తీసుకొచ్చాం: మోదీ

''మా డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ళ‌లో మ‌హిళల‌కు సాధికార‌త క‌ల్పించింది. వారికి సాధికార‌త క‌ల్పించ‌డ‌మనేది భార‌త‌దేశ అభివృద్ధికి అత్య‌వ‌స‌రం. నేడు ఆర్మీ నుంచి మైన్స్ వ‌ర‌కు అన్ని రంగాల్లో పాల‌సీలను మ‌హిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నాం'' అని మోదీ చెప్పారు.

Modi: ఆర్మీ నుంచి మైన్స్ వ‌ర‌కు మ‌హిళ‌ల‌ను దృష్టిలో పెట్టుకునే పాల‌సీలు తీసుకొచ్చాం: మోదీ

Pm Modi

Modi: మ‌హిళా సాధికార‌త కోసం త‌మ ప్ర‌భుత్వం ఎన‌లేని కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో ఆయ‌న నేడు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అలాగే, గిరిజ‌న‌ మ‌హిళ‌ల‌కు పోష‌కాహారం అందించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి, అనంత‌రం ఓ ర్యాలీలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

Agnipath: ఆసుప‌త్రి నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సోనియా గాంధీ

”మా డ‌బుల్ ఇంజ‌న్ (కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ స‌ర్కారు) ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ళ‌లో మ‌హిళల‌కు సాధికార‌త క‌ల్పించింది. వారికి సాధికార‌త క‌ల్పించ‌డ‌మనేది భార‌త‌దేశ అభివృద్ధికి అత్య‌వ‌స‌రం. నేడు ఆర్మీ నుంచి మైన్స్ వ‌ర‌కు అన్ని రంగాల్లో పాల‌సీలను మ‌హిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నాం” అని మోదీ చెప్పారు. మ‌హిళ‌లు త‌మ‌కు ఇష్టం వ‌చ్చి రంగంలో ఉద్యోగాలు చేయాల‌ని ఆయ‌న చెప్పారు. అందుకోసం ఉన్న అడ్డంకుల‌ను తాము తొల‌గించామ‌ని తెలిపారు. వారికి ఇష్టం వ‌చ్చిన రంగాన్ని ఎంచుకోవ‌డానికి ఇప్పుడు అన్ని ద్వారాలూ తెరుచుకున్నాయ‌ని చెప్పారు.