Full Schedule : 2022 టీమిండియా ఫుల్ షెడ్యూల్.. సౌతాఫ్రికా టూర్ నుంచి టీ20 వరల్డ్ కప్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

ఇంగ్లాండ్ టూర్ నుంచి మొదలైన టీమిండియా బిజీ షెడ్యూల్.. టీ20 వరల్డ్ కప్ వరకు ఎప్పుడు.. ఎక్కడ ఏ మ్యాచ్ ఆడనుందో 2022 ఫుల్ షెడ్యూల్ ఓసారి లుక్కేయండి..

Full Schedule : 2022 టీమిండియా ఫుల్ షెడ్యూల్.. సౌతాఫ్రికా టూర్ నుంచి టీ20 వరల్డ్ కప్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

From England Tour To T20 World Cup Team India's Full Schedule For 2022

Team India Full Schedule : 2021 ఏడాది టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించిపెట్టింది… అంతే.. చేదు జ్ఞాపకాలను మిగిల్చిపోయింది. ఏడాది చివర్లో సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్‌ టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఆ విజయంతో ఫుల్ జోష్ మీద ఉంది.. నూతన ఉత్సాహంతో 2022 కొత్త ఏడాదికి వెల్ కం చెప్పేసింది టీమిండియా.. WTC ఫైనల్లో న్యూజిలాండ్‌ పై పరాజయం పాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్‌ ఫెవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ, లీగ్‌ దశలో వెనుదిరిగింది.

2022 కొత్త ఏడాదిలో టీమిండియా బిజీబిజీ షెడ్యూల్‌తో ఉండనుంది. ఏడాదంతా ఫుల్ మ్యాచ్‌లతో టీమిండియా కళకళలాడనుంది. దక్షిణాఫ్రికాతో టూర్ నుంచి డిసెంబర్ వరకు అన్ని ఫార్మాట్లతో కలిపి సూపర్ మ్యాచ్ లు ఆడనుంది. 2022 టీమిండియా ఫుల్ షెడ్యూల్ పెద్దదే.. ఎన్నో మ్యాచ్‌ల్లో.. ఎన్నో టూర్లతో బిజీగా గడిపేయనుంది. ఈ గ్యాప్‌లోనే T20 ప్రపంచకప్‌ 2022, IPL- 2022, ఆసియా కప్‌ ఆడనుంది. కోవిడ్‌ ప్రభావం లేకుంటే ఈ సిరీస్‌లన్నీ సజావుగా సాగుతాయి. లేదంటే వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ టూర్ నుంచి మొదలైన టీమిండియా బిజీ షెడ్యూల్.. టీ20 వరల్డ్ కప్ వరకు ఎప్పుడు.. ఎక్కడ ఏ మ్యాచ్ ఆడనుందో 2022 ఫుల్ షెడ్యూల్ ఓసారి లుక్కేయండి..

2022లో ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌ టీమిండియాకు అతిపెద్ద అసైన్‌మెంట్‌.. భారత క్రికెట్ జట్టుకు యాక్షన్-ప్యాక్ ఏడాదిగా చెప్పవచ్చు. వాండరర్స్ వద్ద జోహన్నెస్‌బర్గ్ వేదికగా జనవరి 3న దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. జనవరి 7 వరకు రెండు టెస్టు కొనసాగుతుంది. జనవరి 11 నుంచి 15 వరకు కేప్ టౌన్‌లో మూడో చివరి టెస్ట్ ఆడనుంది. వెస్టిండీస్, శ్రీలంకలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు భారత్ దక్షిణాఫ్రికాతో ODIలలో తలపడనుంది. అంతర్జాతీయ సీజన్ IPL 2022 సీజన్ కోసం మధ్యలో భారత క్రికెట్ జట్టు విరామం తీసుకోనుంది. ఇందులో లక్నో అహ్మదాబాద్ నుండి రెండు కొత్త జట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో పర్యటించి, టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ కూడా ఆడనుంది.

దక్షిణాఫ్రికా పర్యటన (Tour of South Africa ) :

రెండో  టెస్ట్ – జనవరి 3-7 (జోహన్నెస్‌బర్గ్)
మూడో టెస్ట్ – జనవరి 11-15, (కేప్ టౌన్)
ఒకటో ODI – జనవరి 19, (పార్ల్ – Paarl)

రెండో వన్డే – జనవరి 21, (పార్ల్ – Paarl)

మూడో ODI – జనవరి 23, (కేప్ టౌన్)

హోమ్ సిరీస్ vs వెస్టిండీస్ (Home series vs West Indies) :

ఒకటో వన్డే – ఫిబ్రవరి 6, (అహ్మదాబాద్)

రెండో వన్డే – ఫిబ్రవరి 9, (జైపూర్)

మూడో వన్డే – ఫిబ్రవరి 12, (కోల్‌కతా)

ఒకటో  T20I – ఫిబ్రవరి 15, (కటక్)

రెండో T20I – ఫిబ్రవరి 18, (వైజాగ్)

మూడో టీ20: ఫిబ్రవరి 20, (త్రివేండ్రం)

హోమ్ సిరీస్ vs శ్రీలంక (Home series vs Sri Lanka) :

 

ఒకటో టెస్టు – ఫిబ్రవరి 25-మార్చి 1, (బెంగళూరు)

రెండో టెస్టు – మార్చి 5-9, (మొహాలీ)

ఒకటో టీ20: మార్చి 13, (మొహాలీ)

రెండో టీ20: మార్చి 15, (ధర్మశాల)

మూడో టీ20: మార్చి 18, (లక్నో)

April-May : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ బ్రేక్

Home series vs South Africa:

ఒకటో T20I – జూన్ 9, (చెన్నై)

రెండో టీ20 – జూన్ 12, (బెంగళూరు)

మూడో టీ20: జూన్ 14, (నాగ్‌పూర్)

నాల్గో టీ20: జూన్ 17, (రాజ్‌కోట్)

ఐదో టీ20: జూన్ 19, (ఢిల్లీ)

Tour of England:

One-off Test – జూలై 1-5, మాంచెస్టర్

(భారత శిబిరంలో కోవిడ్ వ్యాప్తి కారణంగా రద్దు చేసిన గత ఏడాది మాంచెస్టర్‌లో 5వ టెస్టుకు ఈ మ్యాచ్..)

ఒకటో T20I – జూలై 7, (సౌతాంప్టన్)

రెండో T20I – జూలై 9, (బర్మింగ్‌హామ్)

మూడో T20I – జూలై 10, (నాటింగ్‌హామ్)

ఒకటో వన్డే – జూలై 12, (లండన్)

రెండో వన్డే – జూలై 14, (లండన్)

మూడో ODI – జూలై 17, (మాంచెస్టర్)

Tour of West Indies:

– తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఆసియా కప్ (Asia Cup) :

తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

T20 ప్రపంచ కప్ (T20 World Cup) :

అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు..

బంగ్లాదేశ్ పర్యటన (Tour of Bangladesh) :

తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Read Also : Covid Cases In Delhi : కొత్త ఏడాది రోజు ఢిల్లీలో భారీగా కోవిడ్ కేసులు..మే-21 తర్వాత ఇదే అత్యధికం