Fuel Prices : ఈ బాదుడు ఆగేదెన్నడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. ఇది 22వ సారి..

చమురు కంపెనీల బాదుడు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు వాహనదారులకు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి.

Fuel Prices : ఈ బాదుడు ఆగేదెన్నడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. ఇది 22వ సారి..
ad

Fuel Prices : చమురు కంపెనీల బాదుడు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు వాహనదారులకు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. తాజాగా పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్ పై 27 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మే 4 నుంచి ఇప్పటి వరకు 22 సార్లు పెరిగిన ధరలు పెరిగాయి. 22 సార్ల పెరుగుదలలో ఇప్పటి వరకు పెట్రోల్ పై రూ.5 , డీజిల్ పై రూ. 5.50 పెరిగింది.

ఇప్పటికే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వంద మార్క్‌కు చేరువలో ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో దాదాపు 16 సార్లు ధరలు పెరిగాయి. గతేడాది కాలంలో పెట్రోల్ పై లీటరుకు సుమారు రూ.27, డీజిల్ ధర రూ.24 పెరిగింది. చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారం తాము మోయలేము అంటున్నారు. బండి బయటకు తియ్యాలంటేనే వణుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనాలు నడపడం కంటే అమ్ముకోవడం బెటర్ ఏమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధన ధరలు:

* ఢిల్లీలో లీటర్ పెట్రోల్ డీజిల్ పై 19 పైసల చొప్పున పెంపు

* ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.56.. డీజిల్ రూ. 86.47

* ముంబైలో పెట్రోల్ లీటరు రూ. 101.76, డీజిల్ రూ. 93.85

* హైదరాబాద్ లో లీటరు పెట్రోలు రూ.99.32, డీజిల్ రూ. 94.26

* కోల్ కతా లో పెట్రోలు రూ.95.52, డీజిల్ రూ. 89.32

* చెన్నై లో పెట్రోలు రూ.96.94, డీజిల్ రూ. 96.94