దయచేసి ఇలా చేయొద్దు, టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ముఖ్య గమనిక

  • Published By: naveen ,Published On : June 4, 2020 / 05:20 AM IST
దయచేసి ఇలా చేయొద్దు, టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ముఖ్య గమనిక

జూన్ 8వ నుంచి తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యాశాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి చూసుకోవాలని అధికారులు సూచించారు. ఇలా చేయడం వల్ల గందరగోళానికి తావు లేకుండా సజావుగా పరీక్షలు రాసుకునే అవకాశముంటుందని చెప్పారు.

బెంచీ, బెంచీకి 4-5 ఫీట్ల దూరం, ఒక్కో గదిలో 15మంది విద్యార్థులే:
* కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. 
* బెంచీ, బెంచీకి మధ్య 4-5 ఫీట్ల దూరం. 
* ఒక్కో గదిలో 10 -15 మంది విద్యార్థులకే అనుమతి. 
* పాత పరీక్షా కేంద్రాలతోపాటు కొత్తగా 346 కేంద్రాలను ఏర్పాటు. 
* ఎవరు, ఏ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందన్న వివరాలను డీసీఈబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో. 
* ఒకే ప్రాంగణంలోని అదనపు కేంద్రాలకు ఏ, బీ  కేంద్రాలుగా విభజన. 
* కొత్తగా ఏర్పాటుచేసిన వాటిని పాత కేంద్రాలకు 500 మీటర్ల దూరంలోనే నెలకొల్పారు. 
* విద్యార్థులు పాత హాల్‌ టికెట్‌తోనే పరీక్ష రాయవచ్చు. 
* ఎవరైనా విద్యార్థులు హాల్‌టికెట్‌ పొగొట్టుకొని ఉంటే ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచన. 

విద్యార్థులు చేయాల్సినవి, చేయకూడనివి:
* పరీక్షా కేంద్రాల దగ్గర తోటి విద్యార్థులతో గుమిగూడకుండా ఎవరికి వారు జాగ్రత్త పడాలి. 
* పరీక్షకు హాజరయ్యేవారంతా విధిగా ఫేస్ మాస్క్‌ ధరించాలి.
* షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం, ఇతరుల పెన్నులు, పెన్సిళ్లను నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. 
* పరీక్ష రాసి ఇంటికి వెళ్లగానే ప్యాడ్‌తోపాటు పెన్నులను శానిటైజ్‌ చేసుకోవాలి.
* నిత్యం పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి.

సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌:
టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ సందేహాలను 040 – 29701474 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలు సహా ఇతర ఎలాంటి సందేహాలనైనా తీర్చుకునేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాలను సందర్శించి రావడం మంచిదని చెప్పారు.

Read: హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న RTC బస్సులు..! Metro కూడా