ITR filing last day: గంట‌లో 4,73,228 మంది ఐటీఆర్ దాఖ‌లు చేశారు: ఐటీ శాఖ‌

ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయ‌డానికి చివ‌రి రోజైన నేడు (జూలై 31) 34 ల‌క్ష‌ల మంది వాటిని దాఖ‌లు చేశార‌ని ఆదాయ ప‌న్ను శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంట‌లలోపు అవి దాఖ‌ల‌య్యాయ‌ని పేర్కొంది.

ITR filing last day: గంట‌లో 4,73,228 మంది ఐటీఆర్ దాఖ‌లు చేశారు: ఐటీ శాఖ‌

Itr Last Date

ITR filing last day: ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయ‌డానికి చివ‌రి రోజైన నేడు (జూలై 31) 34 ల‌క్ష‌ల మంది వాటిని దాఖ‌లు చేశార‌ని ఆదాయ ప‌న్ను శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంట‌లలోపు అవి దాఖ‌ల‌య్యాయ‌ని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డానికి జూలై 31 చివ‌రి తేద‌ని ఆదాయ ప‌న్ను శాఖ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి 4 గంట‌ల మ‌ధ్య 4,73,228 మంది ఐటీఆర్ దాఖ‌లు చేసిన‌ట్లు వివ‌రించింది.

నిన్న రాత్రిలోపు మొత్తం క‌లిపి 5.10 కోట్ల‌కు పైగా ఐటీఆర్‌లు దాఖ‌ల‌య్యాయ‌ని ఐటీ శాఖ‌ తెలిపిన విష‌యం తెలిసిందే. ఐటీఆర్ దాఖ‌లులో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే orm@cpc.incometax.gov.inకు మెయిల్ పంపాల‌ని, లేదంటే 1800 103 0025 లేక‌ 1800 419 0025కు ఫోన్ చేసి అడ‌గొచ్చ‌ని పేర్కొంది. ఐటీఆర్ దాఖ‌లులో ఆల‌స్య‌మైతే ఆప‌రాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపింది. కాగా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయ‌డానికి గ‌డువును మ‌రింత పెంచాల‌న్న విజ్ఞ‌ప్తులు కూడా ఐటీ శాఖ‌కు వ‌స్తున్నాయి.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా