G.Nageswara Reddy : ఆ విషయంలో విశ్వక్ సేన్‌దే తప్పు.. ప్రముఖ డైరెక్టర్ వ్యాఖ్యలు..

తాజాగా ఈ వివాదంపై ప్రముఖ కామెడీ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి స్పందించాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ........

G.Nageswara Reddy : ఆ విషయంలో విశ్వక్ సేన్‌దే తప్పు.. ప్రముఖ డైరెక్టర్ వ్యాఖ్యలు..

G.Nageswara Reddy comments on arjun and vishwak movie issue

G.Nageswara Reddy :  ఇటీవల అర్జున్ – విశ్వక్ సేన్ మధ్య సినిమా వివాదం జరిగిన సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా సినిమా ప్రారంభమైంది. కానీ ఎన్ని సార్లు పిలిచినా విశ్వక్ షూటింగ్ కి రాలేదు. షూటింగ్ ప్లాన్ చేసిన తర్వాత కూడా ముందు రోజూ షూటింగ్ ఆపేయమని షాక్ ఇచ్చాడు విశ్వక్. కథలో వేలు పెట్టడం, మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చాలని అనడం ఇలా చాలా మార్పులు సూచించాడు విశ్వక్. ఇవి కుదరదని అర్జున్ చెప్పడంతో విశ్వక్ అసలు ఆ సినిమా టీంకి రెస్పాండ్ అవ్వడం కూడా మానేశాడు.

దీంతో అర్జున్ సీరియస్ అయి ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ పై ఆరోపణలు చేసి, ఇలాంటి కమిట్మెంట్ లేని హీరోని ఇప్పటిదాకా చూడలేదని ఫైర్ అయ్యాడు. విశ్వక్ కూడా ఓ ఈవెంట్ లో దీనిపై మాట్లాడుతూ అవును మార్పులు అడిగాను, చేయలేదు, నాకు నచ్చలేదు అందుకే సినిమా నుంచి తప్పుకున్నాను అని చెప్పాడు. దీంతో ఈ విషయంలో అందరూ విశ్వక్ దే తప్పని అంటున్నారు. విశ్వక్ కూడా బహిరంగంగా అర్జున్ కి సారీ చెప్పాడు. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ అంశంపై వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఈ వివాదంపై ప్రముఖ కామెడీ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి స్పందించాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ”కథ చెప్పకుండా, హీరో కథ వినకుండా ఏ సినిమా మొదలవ్వదు. హీరోకి కథ నచ్చకపోతే సినిమా స్టార్ట్ అవ్వకముందే చెప్పాలి. సినిమా అంతా స్టార్ట్ అయ్యాక కథ నచ్చలేదని వెళ్ళిపోతే హీరోదే తప్పు. ఈ విషయంలో విశ్వక్ దే తప్పు.”

Ali : తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అలీ..

”ఈ జనరేషన్ హీరోలు ఏం జరుగుతుందో అంతా మాకు తెలియాలి అంటున్నారు. కథ ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటున్నారు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. విశ్వక్ కథ ట్రీట్మెంట్ మొత్తం అయ్యాక షూటింగ్ కి వెళదామని చెప్పి ఉంటే బాగుండేది. కానీ అలా ఒకరోజు ముందు షూటింగ్ ఆపడం చాలా తప్పు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి” అని తెలిపారు.